హైదరాబాద్ : నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఓ ఫ్లైవుడ్ దుకాణంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పక్కనున్న నాలుగు దుకాణాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూటే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే గాని ఆస్తినష్టాన్ని అంచనా వేయలేమని పోలీసులు తెలిపారు.