Attapur kidnap Case | హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అత్తాపూర్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. యువతిని పోలీసులు మలక్‌పేట్‌లో గుర్తించారు. ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేశారు. యువతి ఇంట్లోనే సురక్షితంగా ఉన్నట్టు గుర్తించారు.
అర్ధరాత్రి మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని తెలిసిందే. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న యువతి మొదట జాయ్ ఆస్పత్రిలోకి పరిగెత్తింది. కానీ లాభం లేకుండాపోయింది. యువకులు ఆస్పత్రి సిబ్బందిని బెదిరించి యువతిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు కారును చేజ్ చేశారు. కానీ నలుగురు యువకులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు.
నిందితులు ఉపయోగించిన కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీసులకు వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు చేజింగ్ సమయంలో కారు వెనుకాలే మరో బైక్ కూడా ఫాలో అయినట్లుగా గుర్తించారు. దర్యాప్తు కొనసాగించిన పోలీసులు ఎట్టకేలకు యువతి ఆచూకీ తెలుసుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్
థార్ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు
వారి నుంచి తప్పించుకునేందుకు జాయ్ ఆసుపత్రిలోకి పరిగెత్తిన యువతి
యువతిని బెదిరించి కారులో తీసుకెళ్లిన యువకులు
పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
థార్… pic.twitter.com/wtjDlduFff
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2026
Chattogram | బంగ్లాదేశ్‌లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు