శివారు ప్రాంతాలు మెరిసేలా
హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాటి నలు దిక్కులా శరవేగంగా విస్తరిస్తున్నది.
- హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లపై క్షేత్రస్థాయిలో సర్వే..
- పట్టణీకరణకు అనుగుణంగా విశాలమైన రోడ్ నెట్ వర్క్
- పారిశ్రామిక కారిడార్లలో ప్రత్యేక దృష్టి
- భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు
సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాటి నలు దిక్కులా శరవేగంగా విస్తరిస్తున్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభివృద్ధికి మరింత ఊతమిస్తున్నది. భవిష్యత్ పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని 2008లో రూపొందించిన హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లోని రోడ్లను దశల వారీగా అభివృద్ధి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో సైతం ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది.
భవిష్యత్ అభివృద్ధికి దోహదం చేసేలా మాస్టర్ ప్లాన్..
ప్రస్తుత జనాభాతో పాటు భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని విశాలమైన రోడ్లు ఉండేలా ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల పరిధిలో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రోడ్ల విస్తీర్ణం 60 అడుగుల నుంచి 80,100,120 అడుగుల విస్తీర్ణంతో ఉండేలా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో రోడ్లను మార్కింగ్ చేశారు. కొత్తగా 5 ఎకరాలకు పైబడి ఉన్న లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలంటే అప్రోచ్ రోడ్డు కనీసం 100 అడుగులు ఉండాలన్న నిబంధనను అమలు చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఆయా ప్రాం తాల్లో ఎంత ట్రాఫిక్ పెరిగినా తట్టుకునేలా రోడ్లను తీర్చిదిద్దుతున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో పట్టణీకరణతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.
ఓఆర్ఆర్ మాదిరిగానే మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎంతో ముందు చూపుతో చేపట్టిన ఔటర్ రింగు రోడ్డు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నది. ఇదే తరహాలో ఔటర్ నుంచి రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) వైపు అనుసంధానమయ్యే 60కి పైగా రోడ్లను మాస్టర్ ప్లాన్‌లో నిర్ణయించిన విధంగా అందుబాటులోకి తేవాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది.
క్షేత్ర స్థాయిలో మొదలైన సర్వే..
నగరం నుంచి నలుమూలలా విస్తరించిన ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ముందుగానే మార్కింగ్ చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లను అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 4 జోన్లైనా శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ ప్రాంతా ల్లో ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి, అక్కడ రోడ్లను మాస్టర్ ప్లాన్‌లో నిర్ణయించిన విధంగా విస్తరించేందుకు ప్రతిపాదనలు రూపొందించనున్నా రు. హెచ్ఎండీఏ పరిధిలో కొత్తగా ని వాసాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ప్రణాళికా బద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండీఏ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతాల్లో రోడ్ నెట్ వర్క్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తున్నది. ఆ తర్వాత డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, పార్కులు ఇలా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Field level survey
- hmda
- Roads
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

