నగరంలో ముమ్మరంగా ఇంటింటి సర్వే.. ఒక్కరోజే 40వేల ఇళ్లలో పూర్తి..
ముమ్మరంగా ఇంటింటి సర్వే | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నియంత్రణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలకు చెందిన 641 బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. ఒక్కో బృందంలో ఓ ఏఎన్ఎం, ఆశావర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బందితో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి థరల్ స్కానర్తో పరీక్షణలు నిర్వహించారు.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నియంత్రణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలకు చెందిన 641 బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. ఒక్కో బృందంలో ఓ ఏఎన్ఎం, ఆశావర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బందితో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి థరల్ స్కానర్తో పరీక్షణలు నిర్వహించారు.
ఒక్కరోజే 40వేల ఇళ్లలో సర్వే చేపట్టి 1487 మంది జ్వరంతో ఉన్నారని గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న 1487 మందిలో 1400 మందికి వెంటనే కొవిడ్ మందుల కిట్ అందజేశారు. బాధితుల వివరాలు సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. సోమవారం నుంచి నగరంలో ప్రారంభమైన ఈ ఫీవర్ సర్వేలో ప్రాథమికంగా 393 సర్వే బృందాలు పాల్గొన్నాయి. మంగళవారం ఈ బృందాల సంఖ్య 641కు పెంచారు.
నగరంలోకి ప్రతి బస్తీ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానల్లో కొవిడ్ అవుట్ పేషంట్లకు పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడంతో నేడు అన్ని ఆసుపత్రుల్లో 18,600 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
వీరిలో 3,600 మందికి స్వల్ప జ్వరం ఉన్నట్లు గుర్తించి వారికి కరోనా నివారణ మందుల కిట్లను అందజేశారు. ఇంటింటి సర్వే, ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య పరీక్షల నిర్వహణను సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

