ఆదిలోనే కట్టడి

- సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు
- ఓ వైపు సర్వే, మరోవైపు మందుల కిట్
- ప్రాథమిక దశలోనే మహమ్మారి అంతం
- ఐదోరోజు 53వేల ఇండ్లలో ఫీవర్ సర్వే
- ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కట్టడి చర్యలు
కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే సత్ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సర్వేలో సగటున 700 బృందాలు పాల్గొంటున్నాయి. ఇంటింటికి తిరుగుతూ భరోసా కల్పిస్తున్నాయి. అంతేకాక ప్రతి నిత్యం 40 వేలకు పైగా ఇండ్లను సందర్శించి ఎవరైనా జ్వరం, కొవిడ్ లక్షణాలతో బాధ పడుతుంటే గుర్తించి మందుల కిట్ అందజేస్తున్నాయి. ఈ కిట్‌లో ఉన్న డాక్సిైస్లెకిన్, పారాసిటమాల్, లెవోసెటైరిజైన్, రాంటాక్, విటమిన్-సి, విటమిన్-డి మందులను ఐదు రోజుల పాటు వాడితే కరోనా రాకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా..
ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన ర్యాపిడ్ ఫీవర్ సర్వేతో జీహెచ్ఎంసీ పరిధిలో గణనీయంగా కరోనా కేసులు తగ్గడం ఖాయమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా చేపడుతున్న ఈ సర్వే ఫలితాలపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారని వైద్యారోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు. కేవలం ఇంటింటి ఫీవర్ సర్వేనే కాకుండా అన్ని ప్రభుత్వ, ఏరియా, బస్తీ దవాఖానాల్లో కొవిడ్ ఓపీ సర్వీసులను ప్రారంభించడం కూడా మంచి పరిణామమని వారు అంటున్నారు. గతంలో పాజిటివ్ కేసులను నిర్ధారించేందుకు కొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు, మరికొన్ని వైద్యశాలలను ఎంపిక చేయడంతో అందరూ ఒకే దగ్గర గుమిగూడటంతో అనేక సమస్యలు తలెత్తేవి. అయితే ప్రస్తుతం నగరంలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తుండటంతో పాటు జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందుల కిట్ అందిస్తున్నారు. ఇది కరోనా రాకుండా ముందస్తుగా నియంత్రించినట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిరంతరాయంగా కంట్రోల్ రూం సేవలు..
జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూం(040-2111 1111) నిరంతర సేవలు అందిస్తోంది. ముఖ్యంగా నగరవాసులకు టెలిమెడిసిన్, వ్యాక్సిన్, కరోనా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టెస్టింగ్ కేంద్రాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నది. రెండు షిఫ్టుల్లో (ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు) పని చేసే ఈ కంట్రలోల్ రూంకు వచ్చే ఫిర్యాదులను వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్నారు. కొవిడ్ నివారణకై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా బాధితులు కరోనా పరీక్షలు, ఆక్సిజన్, టీకాలు తీసుకుంటే వచ్చే ఇబ్బందులు, రెమ్‌డెసివిర్ మందులు, వెంటిలేటర్ సౌకర్యాలపై ఆరా తీస్తున్నారని వైద్యులు వివరిస్తున్నారు.
కరోనా తగ్గుముఖం వెయ్యిలోపే పాజిటివ్ కేసులు
- కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు..ప్రజల్లో పెరిగిన అవగాహనతో గ్రేటర్‌వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టాయి.
- శుక్రవారం గ్రేటర్ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- రంగారెడ్డి జిల్లాలో 457, మేడ్చల్ జిల్లా పరిధిలో 372 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.
- గత రెండువారాలుగా రోజుకు సరాసరిన 1500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గడిచిన 5 రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గణనీయంగా కేసులు తగ్గుతున్నాయి.
ముమ్మరంగా ఐసొలేషన్ కిట్ల పంపిణీ..
- కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ లక్ష హోం ఐసొలేషన్ కిట్లను కొనుగోలు చేసింది.
- గ్రేటర్‌లోని ఆరు జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలో ఇప్పటికే 2000 కిట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
- మరోవైపు నిత్యం స్థానిక పీహెచ్‌సీలు ఇచ్చే బాధితుల జాబితా ఆధారంగా ఆశ కార్యకర్తలు, జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది.
- బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలో పర్యటిస్తున్నారు. వారికి పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.
కిట్లలోని మందులు.. వినియోగం ఇలా..
- డొక్లిైసెక్లిన్ (యాంటీ బయాటిక్, వైరల్) ఐదు రోజులు ఉదయం, రాత్రి
- పారాసిటమాల్ (జ్వరం) పది రోజులు ఉదయం, రాత్రి
- లెవొసిట్రజన్ (జలుబు) పది రోజులు ఉదయం
- ర్యాన్టెక్ (ఎసిడిటీ)పది రోజులు ఉదయం
- విటమిన్ సి (రోగ నిరోధక శక్తి) పది రోజులు ఉదయం, రాత్రి
- మల్టీ విటమిన్ (రోగ నిరోధక శక్తి) పది రోజులు ఉదయం, రాత్రి
- విటమిన్ డి (రోగనిరోధక శక్తి) పది రోజులు ఉదయం
- జ్వరం తగ్గకుంటే ఐదు రోజుల పాటు మిథైల్ ప్రెడ్నిసొలోన్ (స్టెరాయిడ్) మాత్రలు ఉదయం, రాత్రి వేసుకోవాలి.
- తరచూ ఉష్ణోగ్రతను పరీక్షించుకోవాలి. ప్రతిరోజు ఆరు నిమిషాల పాటు నడవాలి.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని జీహెచ్ఎంసీ సూచిస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

