రైతు చట్టాలను రద్దు చేయాలి : ఆర్ నారాయణమూర్తి
రైతు చట్టాలను రద్దు చేయాలి | కేంద్రం ప్రభుత్వ తీసుకోచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు.

రవీంద్రభారతి ఆగస్టు 10 : రైతు చట్టాలపై సినిమా హీరో ఆర్.నారాయణ మూర్తి తీసిన ‘రైతన్న’ అనే సినిమాపై అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ అభ్యుదయ హీరో ఆర్.నారాయణ మూర్తి, రైతు సంఘం నాయకులు, గద్దర్, కాంగ్రెస్ నాయకుడు ఎ.కోదండరెడ్డి, వి.వెంకట్రామయ్య, పశ్య పద్మ, తదితరులు హజరయ్యారు.
అనంతరం వక్తలు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై ఆర్.నారాయణ మూర్తి తీసిన సినిమా ద్వారా రైతులు పడుతున్న కష్టాలు తెలిసాయన్నారు. ఆర్.నారాయణ మూర్తికి వారు అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు, రైతులు చూడాలన్నారు. అనంతరం ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ..కేంద్రం ప్రభుత్వ తీసుకోచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు.
ఈ చట్టాల అమలు అయితే, ఏపీ, తెలంగాణ లో ఇస్తున్న ఉచిత విద్యుత్, అన్నీ ప్రభుత్వ పథకాలు రద్దు అవుతాయన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం డాక్టర్. స్వామినాథన్ కమిటీని ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసమే తీసిన ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్‌ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

