Hyderabad | ఉప్పల్‌లో నకిలీ జడ్జి అరెస్ట్.. పిస్టల్ స్వాధీనం
Hyderabad | హైదరాబాద్ : జిల్లా జడ్జి పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తితోపాటు, ఆయనకు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న మరోవ్యక్తిని శుక్రవారం మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు, ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్దరి నుంచి పిస్టల్, రెండు మ్యాగజైన్స్, ఫోర్‌వీలర్ వాహనం, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | హైదరాబాద్ : జిల్లా జడ్జి పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తితోపాటు, ఆయనకు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న మరోవ్యక్తిని శుక్రవారం మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు, ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్దరి నుంచి పిస్టల్, రెండు మ్యాగజైన్స్, ఫోర్‌వీలర్ వాహనం, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ జానకి వివరాలు వెల్లడించారు. వేములవాడకు చెందిన నామల నరేందర్(31) రామంతాపూర్ భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వ్యసనాలకు అలవాటు పడిన నరేందర్ సులువుగా డబ్బు సంపాదించాలనే అక్రమాలకు పాల్పడేవాడు. పలు ఆస్తుల కేసుల్లో నేరస్థుడిగా జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదల అనంతరం ఖమ్మం వెళ్లాడు. అక్కడ అసిస్టెంట్ జిల్లా జడ్జిగా చెప్పుకుంటూ భూవివాదాలను పరిష్కరిస్తానని చెప్పి బాధితుల నుంచి డబ్బులు వసూళ్లు చేశాడు. పలు కేసుల్లో మళ్లీ జైలుకు వెళ్లాడు.
జైలు నుంచి విడుదలైన నరేందర్.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అమీర్‌పేటలోని వెబ్ డిజైనర్ సంతోష్ సహాయంతో నకిలీ ప్రొఫైల్ రూపొందించాడు. వనస్థలిపురానికి చెందిన గార్లపాటి సోమిరెడ్డికి చెందిన భూమి సమస్యలు పరిష్కరించేందుకు రూ.10 లక్షలను తీసుకున్నాడు. భూమి మ్యూటేషన్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కరించకపోవడంతో నరేందర్‌పై సోమిరెడ్డి ఒత్తిడి పెంచాడు. అయితే మాజీ సైనికుడు చిలకం మధుసూదన్‌రెడ్డిని గన్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఈ మేరకు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎస్ఓటీ గిరిధర్, మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డి, ఎస్ఓటీ ఏసీపీ వాసు, సీఐలు గోవిందరెడ్డి, రాములు, ఎస్సైలు వాసుదేవ్, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

