డాక్టర్ అవతారమెత్తి..తప్పుదోవ పట్టించి..

సుల్తాన్‌బజార్, ఆగస్టు 25: ఉస్మానియా దవాఖానలో రోగులను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్జల్‌గంజ్ ఎస్ఐ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన మార్వాన్ బిన్ అబ్దుల్ అజీజ్ (27) అనే వ్యక్తి వైద్యుడిగా అవతారమెత్తి..మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దవాఖానలోని క్యాజువాల్టీ వద్ద రోగులకు వైద్య సేవలు అందిస్తూ..తప్పుడు సమాచారం అందిస్తున్నాడు. అక్కడే ఉన్న సీఎంవో డాక్టర్ ప్రణీత గమనించి ..సీఏఎస్ ఆర్ఎంవో డాక్టర్ ఎంఏ మోహిసిద్ధిఖీకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయన.. అబ్దుల్ అజీజ్‌ను వివరాలు అడిగారు. అతను వైద్యుడు కాదని నిర్ధారించుకొని అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Fake doctor
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

