లాక్ చేయండి.. లేదంటే హ్యాక్..!

- ఫేస్బుక్ ప్రొఫైల్.. హ్యాక్ చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..!
- కరోనా వేళ..కాచుక్కూర్చున్నసైబర్ నేరగాళ్లు
- ప్రొఫైల్‌తో నకిలీ ఖాతా ఓపెన్..
- దవాఖానలో ఎమర్జెన్సీ.. డబ్బులు కావాలంటూ.. కాంటాక్ట్‌లో ఉన్న వారికి రిక్వెస్టులు
- నమ్మి.. మోసపోతున్న అనేక మంది బాధితులు
- తాజాగా సైబరాబాద్ పోలీసు అధికారులసంఘం అధ్యక్షుడి ఫేస్బుక్ ఖాతా హ్యాక్
ఫేస్బుక్లో మీ ప్రొఫైల్‌ను లాక్ చేసుకున్నారా..? లేకపోతే మీ ప్రొఫైల్‌ను సైబర్ క్రిమినల్స్ తస్కరించి.. నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టిస్తారు. మీ కాంటాక్ట్‌లోని స్నేహితులకు మీరు కోరుతున్నట్లు డబ్బు కోసం రిక్వెస్టులు పెడుతారు. ఫేస్బుక్ ఖాతాదారులు.. తస్మాత్ జాగ్రత్త. తాజాగా కరోనా పేరుతో దవాఖానలో ఎమర్జెన్సీ ఉందంటూ డబ్బులు లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అవుతున్నాయి. ఇది తెలియని మీ స్నేహితులు బోల్తా పడుతున్నారు. పోలీసుల ప్రొఫైల్‌తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారి ఖాతాలను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.
ఫ్రెండ్ రిక్వెస్టు ద్వారా ఖాతాలోకి..
- సైబర్మాయగాళ్లు ముందుగా ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్టు ద్వారా ఖాతాలోకి ప్రవేశిస్తున్నారు.
- ఆ తర్వాత అందులో జరిగే యాక్టివిటీని గమనిస్తున్నారు.
- అందులోని కాంటాక్ట్స్‌ను కాపీ చేసుకుంటూ.. ఖాతాదారుడి ప్రొఫైల్‌లోని సమాచారం దొంగిలిస్తున్నారు.
- అదే సమాచారంతో మరో ఫేస్బుక్ ఐడీని సృష్టించి అసలు ఖాతాలో ఉన్న ఐడీలోని కాంటాక్ట్స్‌ను అందులోకి మార్చుకుంటారు.
- ఇలా సైబర్ దొంగలు నకిలీ ఐడీ ఖాతాతో మాయ చేస్తున్నారు.
- ఎవరైనా అనుమానం వచ్చి ప్రొఫైల్‌ను తనిఖీ చేసినా.. యథావిధిగానే కనిపిస్తాయి.
- ఇలా నకిలీ ఖాతాలను సృష్టిస్తున్న సైబర్ మాయగాళ్లు కేవలం అనారోగ్యం పేరుతో, దవాఖానలో చేరినట్లు, లేదా తన స్నేహితుడికి ఆపద వచ్చిందని నమ్మించి అసలు ఖాతాదారులు అడిగినట్లుగా డబ్బులు అడుగుతున్నారు.
- ఈ డబ్బులు కూడా పెద్దఎత్తున అడిగితే అనుమానం వస్తుందని భావించి రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు అడుగుతూ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు.
- ఈ నగదును అసలు ఖాతాదారుడి యూపీఐ, బ్యాంక్ ఖాతాలకు వేస్తామంటే వద్దని మరో యూపీఐ, బ్యాంక్ ఖాతాల నంబర్లను ఇస్తున్నారు.
- దీంతో చాలా మంది నమ్మి డబ్బులు వేస్తూ.. మోసపోతున్నారు.
సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడి ఫేస్బుక్ హ్యాక్
మంగళవారం సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారు. అతడి పేరు మీద మరో ఖాతాను తెరిచారు. ఆ తర్వాత నకిలీ ఫేస్బుక్ ఖాతా ప్రొఫైల్‌కు భద్రారెడ్డి ఫొటోను పెట్టారు. కాంటాక్ట్స్‌లో ఉన్న వారిని హాయ్.. ఎలా ఉన్నారు.. బాగున్నారా.. అంటూ పలుకరించారు. తర్వాత నాకు రూ.20 వేలు అర్జెంటుగా అవసరం ఉంది. సాయంత్రానికి ఇచ్చేస్తాను అంటూ మెసేజ్ పెట్టారు. ఇలా దాదాపు కాంటాక్ట్స్‌లో ఉన్న అందరికీ మెస్సేజ్ వెళ్లింది.
వాట్సాప్ ద్వారా కూడా..
సైబర్ మాయగాడు భద్రారెడ్డి పేరు మీద డబ్బులను వసూలు చేసేందుకు మరో స్కెచ్ వేశాడు. ఓ నంబర్ తీసుకుని దానికి వాట్సాప్ డీపీని భద్రారెడ్డి ఫొటో పెట్టి వాట్సాప్‌లో కూడా అందరికీ మెస్సేజ్ పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన భద్రారెడ్డి స్నేహితుడు వెంటనే నేరుగా భద్రారెడ్డికి ఫోన్ చేసి ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా మెస్సేజ్ ఎందుకు పంపిస్తున్నావని అడిగాడు. అనుమానం రావడంతో భద్రారెడ్డి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే తన ఫేస్బుక్ ఖాతా బ్లాక్ చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులు 20మంది ద్వారా రిపోర్ట్ చేయించాడు. దీంతో కొద్ది సేపటి తర్వాత ఆ నకిలీ ఫేస్బుక్ ఖాతా డిలీట్ కావడంతో పాటు బ్లాక్ అయ్యింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

