ట్యాంకర్ బుకింగ్స్‌లో వసూళ్ల దందా
జలమండలి ట్యాంకర్ల బుకింగ్స్‌లో రిజర్వాయర్ ఇన్చార్జిలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్యాంకర్ ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులను పక్కన పెట్టి ఒక్కో ట్యాంకర్‌కు గరిష్ఠంగా రూ.500 వరకు అదనంగా తీసుకుని టోకెన్ నంబర్ రాకున్నా తమకు అనుకూలమైనవారికి డెలివరీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- ప్రతి బుకింగ్‌పై ఇన్చార్జిల చేతివాటం!
- ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 అదనంగా వసూళ్లు
సిటీ బ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): జలమండలి ట్యాంకర్ల బుకింగ్స్‌లో రిజర్వాయర్ ఇన్చార్జిలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్యాంకర్ ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులను పక్కన పెట్టి ఒక్కో ట్యాంకర్‌కు గరిష్ఠంగా రూ.500 వరకు అదనంగా తీసుకుని టోకెన్ నంబర్ రాకున్నా తమకు అనుకూలమైనవారికి డెలివరీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ముందుగా బుక్ చేసుకున్నవారు 4-5 రోజులు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. జలమండలి పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండల నేపథ్యంలో ఇళ్లలోని బోర్లు ఎండిపోవడానికి తోడు జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు సరిపోకపోవడంతో మెజార్టీ వినియోగదారులు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇప్పటికీ వేలల్లో ట్యాంకర్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. రిజర్వాయర్ ఇన్చార్జిలు దీన్నే అవకాశంగా మార్చుకుని వసూళ్ల పర్వానికి పాల్పడతున్నట్లు సమాచారం. ఈ అక్రమ దందా సంబంధిత మేనేజర్లకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ దందా ఎస్ఆర్ నగర్-1, ఎస్ఆర్నగర్-2 రిజర్వాయర్లలో విచ్చలవిడిగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా అక్రమ దందా మానుకుని ట్యాంకర్లను వరుస క్రమంలో డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

