ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
హోటల్ మేనేజ్మెంట్ (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, మొదటి సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను ఈ నెల 10 నుంచి, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నారు.
జూనియర్, సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జర్మన్ రెగ్యులర్, పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ మొదటి, రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 18 నుంచి, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ జెనిటిక్ కౌన్సిలింగ్ రెగ్యులర్, సీనియర్ డిప్లొమా ఇన్ సంస్కృతం బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.