రిజర్వేషన్ల అమలు, వయో పరిమితి పెంపును స్వాగతిస్తున్నాం

రవీంద్రభారతి, ఆగస్టు 2: విద్యా, ఉద్యోగ రంగాలలో పూర్తి స్థాయిలో పది శాతం ఈడబ్ల్యూఎస్ కోట రిజర్వేషన్లు అమలు, ఓసీ నిరుద్యోగులకు ఐదేండ్లు వయో పరిమితి పెంపును కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నా రు. బషీర్బాగ్లో ఆయన కార్యాలయంలో ఓసీ ఐక్య రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి సోమవారం నిర్వహించిన సమావేశంలో రామారావు మా ట్లాడారు. ఎన్నో ఏండ్లు పార్టీలకు అతీతంగా అనేక సంఘాలు చేసిన పోరా ట ఫలితంతోనే ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు దక్కాయన్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యా, ఉద్యోగ రంగాల లో పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించినట్లుగా వయోపరిమితిని పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్, ఆర్ధిక శాఖమంత్రి హరీష్రావులకు పోలాడి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలాడి రామారావును సమైక్య నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రాంరెడ్డి, బి.శ్రీనివాసు, డా॥ దీపక్ బాబు, గూడూ రు స్వామిరెడ్డి, బి.శ్రీనివాసరావు, జి.రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ews reservations
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

