ఎక్కువకు అమ్మితే ఊరుకోం…

- ఎమ్మార్పీకే సరుకులు విక్రయించాలి
- ‘బ్లాక్’కు తరలిస్తే సహించేది లేదు
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు పౌరసరఫరాల శాఖ స్పష్టీకరణ
- బంకుల్లో అక్రమాలపై టాస్క్‌ఫోర్స్ నిఘా
లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. ఎమ్మార్పీకే సరుకులు విక్రయించాలని స్పష్టం చేసింది. నూనె, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా.. ఎక్కువ ధరలకు విక్రయించినట్లు ఫిర్యాదులు అందినా.. సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయదేవి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పెట్రోలు బంకులు పని చేస్తాయని, నగరంలో వంట గ్యాస్ పంపిణీలో ఎలాంటి లోటు పాట్లు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. బంకుల్లో అక్రమాలను గుర్తించేందుకు నగరంలో తొమ్మిది టాస్క్‌ఫోర్స్ బృందాలతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ బృందాలు ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తాయని, అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. నిత్యావసర వస్తువులు, వంట నూనెలను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, అధిక ధరలకు విక్రయించడం వంటివి చేస్తే.. వినియోగదారులు 040-23447770 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సుమారు 5.80 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ కోసం ఉదయం 6 నుంచి 10 వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయదేవి వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

