డ్రగ్స్ అమ్ముతూ.. పట్టుపడిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు
ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు దారి తప్పారు.. వ్యసనాలకు అలవాటుపడి.. డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు.. ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు మరో ముగ్గురు అరెస్టయ్యారు.
- మరో ముగ్గురు నిందితులు సైతం అరెస్ట్
- ఎల్ఎస్డీ, ఎండీఎంఏ స్వాధీనం
సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు దారి తప్పారు.. వ్యసనాలకు అలవాటుపడి.. డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు.. ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు మరో ముగ్గురు అరెస్టయ్యారు. నిందితుల వద్ద నుంచి రూ.1.53 లక్షల విలువ చేసే 30 ఎల్ఎస్డీ బ్లాస్ట్‌లు, 5.77 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ తిరుపతి యాదవ్ కథనం ప్రకారం…మాదాపూర్‌కు చెందిన దత్తిలితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
బెంగళూరు కేంద్రంగా గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ తిరుపతి తన బృందంతో కలిసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న దత్తిలితిన్, అభిరామ్, కొడాలి ఏమార్ట్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.83వేల విలువ చేసే 5.77గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వ్యసనాలకు అలవాటుపడి..
వ్యవసనాలకు అలవాటుపడి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను హైదరాబాద్ డీటీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ శిరీష కథనం ప్రకారం…చరణ్ తేజ్, కౌశిక్ తూబోటి, సయ్యద్ సర్ఫరాజ్ చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వ్యసనాలకు అలవాటు పడిన వీరు.. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయిస్తున్నారు. చెన్నై నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరుణ్‌రాజ్ ద్వారా సరుకు కొనుగోలు చేసి, నగరంలో అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న డీటీఎఫ్ బృందం గురువారం జూబ్లీహిల్స్ మాదాపూర్ రోడ్‌నం.37లో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తుండగా ముగ్గురు విద్యార్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

