Power Cuts | భారీ వర్షం.. విద్యుత్ వ్యవస్థ ఆగమాగం
గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్‌లపై నుంచి ఫ్లెక్సీలు ఎగిరిపోయి 33 కేవీ లైన్లు, 11 కేవీ లైన్లపై పడటంతో చాలా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
- అర్ధరాత్రి వరకు పూర్తి కానీ పునరుద్ధరణ
Power Cuts | సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్‌లపై నుంచి ఫ్లెక్సీలు ఎగిరిపోయి 33 కేవీ లైన్లు, 11 కేవీ లైన్లపై పడటంతో చాలా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో అవి విరిగిపోయాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్‌నగర్ సర్కిళ్లతో పాటు రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు కరెంటు లేదు. కాగా విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పర్యవేక్షించారు.
గంటలు గడిచినా రాని కరెంటు…
వర్షం నిలిచిన తరువాత నగరంలో ఓ వైపు ట్రాఫిక్, మరో వైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నది. కొన్ని చోట్ల వర్షం ఆగిపోయి 2 గంటలు గడిచినా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని వందలాది మంది ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రేటర్లో విద్యుత్ నెట్వర్క్ చాలా చోట్ల దెబ్బతినడంతోనే పునరుద్ధరణ పనులు ఆలస్యమైనట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. వర్షంలోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది కరెంటు స్తంభాలు ఎక్కి తీగలపై పడిన చెట్ల కొమ్మలు, ఇతర వస్తువులను తొలగించారని తెలిపారు. రాత్రంతా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేశారని విద్యుత్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

