పోలింగ్ ప్రక్రియ ఇలా..
తొలుత రిటర్నింగ్ అధికారుల ఆధీనంలో ఉన్న ఈవీఎంలను సోమవారం(నేడు) ప్రిసైడింగ్ అధికారి (పీవో) సారథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతారు. అనంతరం ఉదయం 5 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున వచ్చిన ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు.
తొలుత రిటర్నింగ్ అధికారుల ఆధీనంలో ఉన్న ఈవీఎంలను సోమవారం(నేడు) ప్రిసైడింగ్ అధికారి (పీవో) సారథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతారు. అనంతరం ఉదయం 5 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున వచ్చిన ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల్లోగా ఈ ప్రక్రియ ముగిస్తారు. ఏజెంట్లు అన్ని పరిశీలించి.. వారు ఒకే అంటేనే ఈవీఎంలను ఓటింగ్కు ఉపయోగిస్తారు. ఏవైనా సందేహాలుంటే రిజర్వ్ చేసిన ఈవీఎంలను పరీక్షించి.. ఏజెంట్లు ఒప్పుకుంటే వాటిని ఓటింగ్కు వాడతారు.
ఓటర్లలో పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఇలా మూడు రకాల వారుంటారు. ఓటు వేసేందుకు వచ్చినప్పుడు అదనపు ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేక గుర్తులతో మార్కింగ్ చేస్తారు. పోలింగ్ గడువు ముగుస్తుందనే అంశాన్ని 15 నిమిషాల ముందే ప్రిసైడింగ్ అధికారి ప్రకటించాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరూ ఓటు వేయడానికి అర్హులు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి రెండు గంటలకొకసారి పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు.
ఓటింగ్ శాతం పెరిగేనా..?
ఎన్నికలు ఏవైనా గ్రేటర్లో ఉండే ఓటర్లు గడప దాటకపోవడంతో ప్రతిసారీ అత్యల్ప ఓటింగ్ నమోదవుతున్నది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నా.. ఇప్పటికే సొంతూళ్లకు సిటీ జనాలు వెళ్లిపోవడంతో ఈసారి ఓటు హక్కును ఎంతమంది వినియోగించుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో 50 శాతంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్లు ఎంతమంది ఓటేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

