శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి
తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్ధార్ నగర్, రావిర్యాల, మాంఖాల్లో రూ.44లక్షలతో వైకుంఠ ధామాల అభివృద్ధి పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, డిసెంబర్ 30 : తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్ధార్ నగర్, రావిర్యాల, మాంఖాల్లో రూ.44లక్షలతో వైకుంఠ ధామాల అభివృద్ధి పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్మశాన వాటికల అభివృద్ధికి కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు. చివరి మజిలీలో ప్రశాంతంగా ఉండటానికి అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో ఎవరూ పట్టించు కోలేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
తనను కలుడానికి వచ్చే వారు ఎవరైనా పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురాకుండా.. పేద పిల్లలకు అవసరమైన వస్తువులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను దత్తత తీసుకోవాలన్నారు. పిల్లలకు నోట్ పుస్తకాలు, స్టేషనరీ ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచన చేస్తే మార్పు వస్తుందన్నారు. సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. తాను ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ తుక్కుగూడ మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌గౌడ్ రూ.84వేల సొంత డబ్బులతో అంగన్ వాడీ కేంద్రాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. తేజస్వినీ శ్రీకాంత్ గౌడ్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూత సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, కమిషనర్ వెంకట్ రామ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఆపన్న హస్తం..
బడంగ్‌పేట, డిసెంబర్ 30 : ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి రంగనాయకుల చెందిన పి.రాజుకు మంజూరైన రూ.96వేల చెక్కును శుక్రవారం స్థానిక కార్పొరేటర్ యాతం పవన్ కుమార్‌తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందుకూరు, డిసెంబర్ 30 : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దెబ్బడగూడ గ్రామానికి చెందిన డ్యారంగుల ఆంజనేయులుకు మంజూరైన రూ.2.50లక్షల చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మాజీ డైరెక్టర్ జిట్టె రాజేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జంగయ్య, యూత్ అధక్షుడు కొలను విజ్ఞేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

