ఈసీఐఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

అణు ఇంధన, దేశ రక్షణ విభాగానికి కావాల్సిన పరికరాలు అందజేస్తున్నాం
ఈసీఐఎల్ ఆవిర్భావ దినోత్సవంలో చైర్మన్ సంజయ్
చర్లపల్లి, ఏప్రిల్ 11 : స్వదేశీ పరిజ్ఞానంతో అణు ఇంధన, దేశ రక్షణ విభాగాలకు అనేక పరికరాలను ఈసీఐఎల్ సంస్థ అందజేసిందని ఈసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రేర్ అడ్మిరల్ సంజయ్ చౌబే, డైరెక్టర్ పర్సనల్ సమీర్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ఈసీఐఎల్ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని సంస్థ అవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎస్రావు విగ్రహానికి సంజేయ్చౌబే, సమీర్ ముఖర్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ఈసీఐఎల్ సంస్థ దేశానికి ఎన్నో సేవలు అందించిందన్నారు. ముఖ్యంగా అణు ఇంధన, దేశ రక్షణ విభాగానికి కావాల్సిన పరికరాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి అందజేశామని వారు గుర్తు చేశారు. ఈసీఐఎల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుందని, రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీకి ధీటుగా పలు పరికరాలను తయారు చేసి విజయాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు, ఉద్యోగుల సమష్టి కృషితో ఆర్థిక సంవత్సరపు లక్ష్యాలను సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రజానాయక్, జనరల్ మేనేజర్ సుధాంశు, అనిల్సింఘాయి, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

