డిసెంబర్ 12న బుద్ధ విగ్రహం వద్ద సంగీత కచేరీ..
Hussain Sagar | అలా నదీ తీరాన లేదా సముద్ర తీరాన సరదాగా కూర్చొని సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది. మనసు పులకరించి, పరవశించిపోతోంది. ఇంకా ఎన్నో పాటలను వినాలని మనసు కోరుకుంటోంది. మరి అలాంటి

హైదరాబాద్ : అలా నదీ తీరాన లేదా సముద్ర తీరాన సరదాగా కూర్చొని సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది. మనసు పులకరించి, పరవశించిపోతోంది. ఇంకా ఎన్నో పాటలను వినాలని మనసు కోరుకుంటోంది. మరి అలాంటి సంగీత ప్రియులకు హుస్సేన్ సాగర్ వేదిక కానుంది. డిసెంబర్ 12వ తేదీన ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద సంగీత కచేరీ నిర్వహించనున్నారు.
రామ్ప్రపన్న భట్టాచార్య(సితార్), ఠాకూర్ హరిజిత్ సింగ్(తబలా) కలిసి కచేరీ నిర్వహించనున్నారు. ఈ కచేరీకి హాజరయ్యేందుకు ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదు. కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సంగీత కచేరీకి హాజరు కావాలనుకునే వారు.. బుక్ మై షో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే బుద్ధ విగ్రహం వరకు బోటులో వెళ్లేందుకు కేవలం రూ. 100 మాత్రమే వసూలు చేస్తారు.
ఇక రామ్ప్రపన్న భట్టాచార్య, ఠాకూర్ హరిజిత్ సింగ్ కలిసి ఇప్పటి వరకు పబ్లిక్ పార్కుల్లో 18 సంగీత కచేరీలు నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

