Duvvada Madhuri | అనుమతి లేకుండా మద్యం పార్టీ.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి అరెస్ట్
ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు (Duvvada Madhuri) మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న ది పెండెంట్ ఫామ్ హౌస్‌పై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు (Duvvada Madhuri) మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న ది పెండెంట్ ఫామ్ హౌస్‌పై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ప్రధాన అనుచరుడు పార్థసారథి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. బర్త్‌డే పార్టీలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మాధురి కూడా పాల్గొన్నారు. శుక్రవారం మాధురి పుట్టిన రోజు కూడా కావడంతో పార్థసారథి పేరుపై ఫామ్‌హౌస్‌ను బుక్ చేసినట్లు తెలుస్తున్నది. ఈ కార్యక్రమానికి 29 మంది వచ్చినట్లు సమాచారం. అయితే అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంలో స్థానిక పోలీసులతో కలిసి రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్కా బాటిళ్లు, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదుచేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Ponds Auction | రేవంత్ రెడ్డి ఇలాఖాలో సాగు నీటి కోసం చెరువుల, బావుల వేలంపాట.. వీడియో
Rahul Gandhi | పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోంది.. భారత్ సమిట్‌లో రాహుల్‌గాంధీ
Hyderabad devotee | తిరుమలలో పోగొట్టుకున్న 40 గ్రాముల బంగారు కడియాన్ని హైదరాబాద్ భక్తురాలికి తిరిగి అప్పగింత
తుంగతుర్తిలో ఘనంగా విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

