Robbery | కాచిగూడలో పనిచేస్తున్న ఇంటికే కన్నం.. దంపతులకు మత్తుమందు పెట్టి 2 కిలోల బంగారం, 3 కోట్ల నగదుతో పరార్
హైదరాబాద్‌లోని కాచిగూడలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ (Robbery) జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి పెద్దమొత్తంలో డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని కాచిగూడలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ (Robbery) జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి పెద్దమొత్తంలో డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. కాచిగూడకు చెందిన వ్యాపారవేత్త హేమ రాజ్ ఇంట్లో నేపాల్‌కు చెందిన వారు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హేమరాజ్ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపిపెట్టారు. దానిని తిన్న వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఇంట్లో ఉన్న 2 కిలోల బంగారు నగలు, రూ.3 కోట్ల నగదుతో ఉడాయించారు.
అయితే సోమవారం ఉదయం హేమరాజ్ వాకింగ్‌కు రాకపోవడంతో స్నేహితులు అతని ఇంటికి వచ్చారు. దంపతులిద్దరు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన వారు.. దవాఖానకు తరలించారు. తేరుకున్న తర్వాత ఇంటికి వచ్చిన హేమరాజ్ దంపతులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులే దొంగతనానికి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. పని మనుషులను ఎంచుకునే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

