e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home జిల్లాలు Wheelchair cricket | దివ్యాంగ‌ క్రీడాకారులను ఆదుకోవాలి : జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు

Wheelchair cricket | దివ్యాంగ‌ క్రీడాకారులను ఆదుకోవాలి : జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు

చాదర్‌ఘాట్ : దివ్యాంగులైన‌ క్రీడాకారులను ఆదుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్ర, తెలంగాణ వీల్‌ చైర్స్​‍ క్రికెట్‌ మ్యాచ్‌లో రాష్ట్రానికి చెందిన జట్టు విజయం సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వీల్‌ చైర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో రెండు రోజుల పాటు జరిగిన 3 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ లో తెలంగాణ రాష్ట్రం సిరీస్ ను కైవసం చేసుకుంది. తెలంగాణ క్రికెట్‌ టీంకు ఫారుఖ్‌ అహ్మద్‌, ఏపీకు ప్రవీణ్‌కుమార్‌ కెప్టెన్‌లుగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రధానోత్సవానికి కొల్లి నాగేశ్వర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సకలాంగుల క్రీడాకారులకు కల్పించే సౌకర్యాలను దివ్యాంగ క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దివ్యాంగ క్రీడాకారులకు 4శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి టీ.సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement