చినుకుపడగానే వాలిపోతారు

- గ్రేటర్లో 139 నీటి నిల్వ ప్రాంతాలు
- నీటి తొలగింపునకు ప్రత్యేక స్టాటిక్ బృందాలు
- వ్యర్థాలు తీసేందుకు మరో 128 టీమ్స్
- సహాయక చర్యలకు 67 ‘మొబైల్ ఎమర్జెన్సీ’..
భారీ వర్షాలు గతేడాది నగరాన్ని అతలాకుతలం చేయడంతో బల్దియా ముందే అప్రమత్తమైంది. ఎంత వర్షం వచ్చినా నగరవాసులకు ముంపు కష్టాలకు రాకుండా సకల జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడా నీళ్లు నిల్వకుండా వెంటనే పంపించే ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచింది. గ్రేటర్‌వ్యాప్తంగా ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే వాలిపోయి సహాయక చర్యలు చేపట్టేందుకు సంచార అత్యవసర (మొబైల్ ఎమర్జెన్సీ) బృందాలను రంగంలోకి దిం చింది. వెయ్యిమంది సిబ్బందితో ప్రత్యేకంగా 334 మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసి, విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.33 కోట్లు కేటాయించింది.
ప్రధానంగా వర్షం కురిసినప్పుడు అత్యధికంగా నీరు నిలిచే ప్రాంతాలు దాదాపు 139 వరకు ఉన్నట్లు గుర్తించి, ప్రత్యేకంగా 139 స్టాటిక్ లేబర్ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సిబ్బంది ఉంటారు. వర్షం మొదలుకాగానే ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ వెంటనే నీటిని తొలగిస్తారు. వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలు, ఇతరత్రా అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు.
వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా..ధీటుగా ఎదుర్కొనేందుకు బల్దియా సర్వసన్నద్ధమైంది. చినుకుపడినా.. నగరవాసులకు ఏ కష్టమూ రాన్వీకుండా.. మేమున్నామే భరోసా కల్పిస్తున్నది. వర్షాల వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా.. వాయు వేగంతో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. గ్రేటర్‌వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించింది.
334 మాన్సూన్ బృందాలు..
వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే స్పందించేందుకు ఐదు నెలల పాటు కాంట్రాక్టు పద్ధతిలో సుమారు వెయ్యి మంది సిబ్బందిని ఇప్పటికే జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంచింది. వీరిని పలు విభాగాలుగా విభజించి… ఏయే సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని చూపాలనే దానిపై శిక్షణ కూడా పూర్తి చేసింది. ఈ సిబ్బందితో ప్రత్యేకంగా 334 మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు జీహెచ్ఎంసీ రూ.33 కోట్లు కేటాయించింది. ప్రధానంగా వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తున్న 130 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 139 స్టాటిక్ లేబర్ బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సిబ్బంది ఉంటారు. వర్షం మొదలైన తర్వాత నీరు నిలుస్తున్నట్లు గుర్తించిన ప్రాంతాల్లోనే వీరు తిష్ట్టవేసి మరీ… సమస్య తలెత్తినప్పుడు ఆ నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతారు.
మినీ మొబైల్..
నగరంలో వర్షంతో పాటు ఈదురు గాలులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షం పడినప్పుడు దిగువకు వరద ప్రవహించే సమయంలో వ్యర్థాలు అడ్డుగా ఉంటున్నాయి. దీంతో నీరు ఎగువకు తన్నుతున్నది. ఫలితంగా ఆవాసాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ కారణంగానే నీరు నిల్వ ప్రాంతాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలను సిద్ధం చేశారు. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున షిఫ్టు విధానంలో విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ టీమ్‌లు వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలు, ఇతరత్రా అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగిస్తాయి. గాలులకు కూలే చెట్లను కూడా వెంటనే తొలగించి, ట్రాఫిక్ సమస్య రాకుండా చూస్తాయి. అలాగే ప్రత్యేకంగా 67 మొబైల్ ఎమర్జెన్సీ బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. ఒక్కో టీమ్‌లో నలుగురు చొప్పున షిఫ్టు పద్ధతిలో పని చేస్తూ… వాహనాల్లో తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తారు.
చివరి దశలో మరమ్మతు పనులు..
- గతేడాది కురిసిన వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చోట్ల బీటీ, సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. రూ. 52 కోట్లతో 100 కిలో మీటర్ల మేర బీటీ మరమ్మతు పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 47 కిలోమీటర్లు పూర్తయ్యాయి.
- రూ.204 కోట్లతో చేపట్టిన 272 కిలోమీటర్ల సీసీ రోడ్డు పనుల్లో 77 కి.మీలు పూర్తయ్యాయి.
- జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాలు, వరద కాలువలు 1368 కిలోమీటర్ల మేర ఉన్నాయి.
- ఈ సంవత్సరం రూ.45 కోట్లతో 88.15 కిలోమీటర్లు నాలాలో పూడిక తొలగింపు పనులు జనవరిలో ప్రారంభించారు.
- ఇప్పటి వరకు 830 కిలో మీటర్ల వరకు పూడిక తొలగింపు పనులు పూర్తిచేశారు.
- ఇందులో 663.11 కి.మీలు మనుషుల సాయంతో 221 కి.మీలు యంత్రాలతో పూడికతీతలు చేపట్టారు.
- నూతన డ్రైయిన్ల నిర్మాణం, రీ మోడలింగ్, మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.298.34 కోట్లు మంజూరు చేసింది.
- వీటితో మొత్తం 468 పనులు గుర్తించగా… వీటిలో 213 మరమ్మతులు, 142 నూతన డ్రైయిన్ల నిర్మాణం, చైన్ లింకు 83, ఇతర పనులు 30 వరకు ఉన్నాయి.
- ఇప్పటివరకు రూ.16 కోట్ల విలువైన 42 పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 211 వర్క్స్ వివిధ దశల్లో ఉండగా, 147 పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

