కొండాపూర్ : పని చేస్తున్న చోటు నుంచి వెళ్ళిన వ్యక్తి తిరిగిరాకుండా పోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగండ్ల హుడా లేఅవుట్లో నివాసం ఉంటున్న వడ్డే రాయప్ప సోదరుడు వడ్డే లక్ష్మణ్ (25) కొంతకాలంగా విభేదాల కారణంగా భార్యతో విడిపోయి వారింటిలోనే ఉంటూ స్థానికంగా లేబర్‌గా పని చేస్తున్నాడు.
ఫిబ్రవరి 8న ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళాడు. కాగా పని చేస్తున్న చోట కడుపు నొప్పి వస్తుందని చెప్పి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు.ఈ విషయాన్ని లక్ష్మణ్ స్నేహితుడు అతని వదిన లక్ష్మీకి ఫోన్ ద్వారా తెలియజేశాడు.
కానీ అతడు ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో తెలిసిన వారిని, బంధువులను ఆరాతీయగా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.