కరోనా బాధితులకు అన్నప్రసాదం

కరోనా బాధితులకు మూడు పూటలా అన్నప్రసాదాన్ని పంపించాలని దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం ట్రస్ట్ నిర్ణయించింది. గురువారం ట్రస్టు చైర్మన్ బచ్చు గంగాధర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బాధితులకు స్వయంగా తమ సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అందిస్తారని చెప్పారు. ఆలయం నుంచి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తామని పేర్కొన్నారు. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం పీఆర్వో కార్యాలయం నంబర్ 040-24066566, సెల్ ఫోన్ నంబర్- 8330966566లో సంప్రదించి సమాచారం అందిస్తే వారికి శనివారం నుంచి అన్నప్రసాదం పంపిణీ చేస్తామని అన్నారు. కార్యవర్గ సమావేశంలో సలహా కమిటీ చైర్మన్ గుండా మల్లయ్య, ట్రస్ట్ ఉపాధ్యక్షులు వూర నర్సింహగుప్తా, శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ఈవీవీ నాగేశ్వర్రావు, సంయుక్త కార్యదర్శులు బాబురావు, పద్మాకర్ ఆత్రే, కోశాధికారి శ్యాంకుమార్తోపాటు కార్యవర్గసభ్యులు శ్యామలరావు, లక్ష్మీదుర్గ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

