పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

హైదరాబాద్ : పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్‌శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలకు సంబంధించిన కార్యక్రమాలు అతి తక్కువ ధరలకే నిర్వహించుకునేలా.. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రభు త్వం అనుమతించింది. భవన నిర్మాణాల్లో భాగంగా యూసుఫ్‌గూడలోని టీఎస్ఎస్పీ మొద టి బెటాలియన్‌లో నిర్మించబోతున్న కమ్యూనిటీ హాల్‌కు శనివారం డీజీపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో శుభకార్యాలను నామమాత్రపు ధరలతో నిర్వహించుకునే వీలు కల్గుతుందన్నారు. వీటితోపాటు పోలీసులకు వెల్ఫేర్ లోన్లు ఇస్తున్నట్టు డీజీపీ తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ అభిలాషబిస్త్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

