BSNL | మన్సురాబాద్, ఏప్రిల్ 12: బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సర్వీసులను వాడితే వినియోగదారులు సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉండదని ఆ సంస్థ డీజీఎం ఈ.దినేశ్ తెలిపారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, ఆటోనగర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంగణంలో శనివారం బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సర్వీస్ క్యాంప్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీఎం ఈ.దినేశ్ మాట్లాడుతూ.. జూలైలోపు పూర్తిస్థాయిలో 4జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరో ఐదు నెలల్లో 5 జీ సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ సర్వీస్ క్యాంప్ ద్వారా వినియోగదారులు ఎదుర్కొంటున్న సెల్ టవర్స్ సమస్యలు, ఇతర ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు పి. శ్రీనివాస్ రెడ్డి, రవి కిశోర్, రాములు, ఎంటీ రాంజీ తదితరులు పాల్గొన్నారు.