ఆర్డర్స్.. ఔట్‌డేటెడ్!
అంతా ఆన్లైన్ ఆర్డర్స్పైనే షాపింగ్.. చిన్న సబ్బు బిల్ల నుంచి తినే తిండి వరకు ఆన్లైన్ ఆర్డర్స్పైనే నగరవాసులు ఆధారపడాల్సిన పరిస్థితులు అధికమయ్యాయి. ప్రతి ఒక్కరూ రోజులో ఏదో ఒక సమయంలో ఒక ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారంటే అతిశయోక్తిలేదు. అయితే ఆన్లైన్ ఆర్డర్స్ ఎంత వరకు నాణ్యతగా ఉంటాయో అంటే అనేక సందేహాలు వెంటాడుతున్నాయి.
- వినియోగదారులు జరభద్రం
- గడువు ముగిసిన వస్తువులు, నాసిరకం ఆహారం డెలివరీ
- ఇదేంటని ప్రశ్నించిన డెలివరీ బాయ్స్‌పై కంపెనీలు కక్ష సాధింపు చర్యలు
- గిగ్ యూనియన్ ఆధ్వర్యంలో డెలివరీ బాయ్స్ ఫిర్యాదులు
సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : అంతా ఆన్లైన్ ఆర్డర్స్పైనే షాపింగ్.. చిన్న సబ్బు బిల్ల నుంచి తినే తిండి వరకు ఆన్లైన్ ఆర్డర్స్పైనే నగరవాసులు ఆధారపడాల్సిన పరిస్థితులు అధికమయ్యాయి. ప్రతి ఒక్కరూ రోజులో ఏదో ఒక సమయంలో ఒక ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారంటే అతిశయోక్తిలేదు. అయితే ఆన్లైన్ ఆర్డర్స్ ఎంత వరకు నాణ్యతగా ఉంటాయో అంటే అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. ఇటీవల నగరంలో ఆన్లైన్ ఆర్డర్ సర్వీస్ అందించే ఓ కంపెనీ ముందర డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగడం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. తమకు వచ్చే ఆర్డర్స్ ప్యాకింగ్‌లో ఔట్‌డేటెడ్ ప్రాడక్ట్స్ అందిస్తున్నారని, ఆహారమైతే ఇంకో గంటలో పాడయ్యే అవకాశం ఉన్న వాటిని ప్యాక్ చేసి కట్టబెడుతున్నారని డెలివరీ బాయ్స్ గగ్గోలు పెట్టారు. ఈ పక్రియలో వినియోగదారుల ఆరోగ్య రీత్యా డెలివరీ బాయ్స్ సదరు కంపెనీలను నిలదీశాయి. దీంతో ఆ కంపెనీలు కొందరి ఐడీలు బ్లాక్ చేశాయి.
ఈ ఉదంతాన్ని డెలివరీ బాయ్స్ అందరూ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్క్ యూనియన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్రక్రియతో నగరవాసులు తమ ఆహార ఉత్పత్తులపై అవగాహనతో ఉండాలని గిగ్ యూనియన్ హెచ్చరిస్తుంది. నాసిరకం వస్తువులు అంటగట్టి వినియోగదారులకు, డెలివరీ కార్మికులకు మధ్య గొడవలు సృష్టిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గిగ్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ చెప్పారు. స్విగ్గీ, ఇన్ స్టామార్ట్, బిగ్ బాసెట్ డెలివరీ కార్మికుల ఐడీలు బ్లాక్ చేసి వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని తెలిపారు. గడువు ముగిసిన ఉత్పత్తులు ఉన్న ఆర్డర్ లను తమకు కేటాయిస్తున్నారని హస్తినాపూర్ లోని స్విగ్గీ ఇన్ స్టామార్ట్ డెలివరీ కార్మికులు ఆరోపించారు.
ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత, కార్మికులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ను ఆశ్రయించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సన్నీ తనిఖీ నిర్వహించడానికి వచ్చినట్లు సమాచారం. అయితే, స్టోర్ యాజమాన్యం బౌన్సర్లను ఉపయోగించి తనిఖీని అడ్డుకున్నారని వివరించారు. ప్రధాన క్విక్-కామర్స్, కిరాణా ఆపరేటర్లతో పాటు సూపర్ మారెట్లు, వేర్ హౌస్ లు మరియు డార్ స్టోర్ లను కూడా కవర్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ డ్రైవ్ ను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

