బరాత్‌లో విషాదం..

- బ్యాండ్ గ్రూప్ నిర్వాహకుడి అనుమానాస్పద మృతి
- మృతిపై అనుమానాలున్నాయి: కుటుంబ సభ్యులు
- విచారణాధికారిగా ఏసీపీ రఘునందన్ నియామకం
కొండాపూర్, ఆగస్టు 28 : ఓ బ్యాండ్ గ్రూప్ నిర్వాహకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. అయితే మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబసభ్యులు చెబుతుండగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గచ్చిబౌలి పీజేఆర్ కాలనీకి చెందిన వడ్ల వీరేశం ఇంట్లో వివాహ వేడుక జరిగింది. బరాత్ కార్యక్రమానికి సికింద్రాబాద్ సరస్వతి బ్యాండ్ గ్రూప్‌ను మాట్లాడుకున్నారు. నిర్వాహకుడు నరేశ్‌తో పాటు అతని బృందం పాల్గొంది. రాత్రి 11.20 గంటలకు స్థానికులు బ్యాండ్ సౌండ్ వల్ల నిద్రపట్టడం లేదని డయల్ 100 కు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చి బరాత్‌ను నిలిపివేయాలని చెప్పి వెళ్లిపోయారు. వారు బేఖాతర్ చేసి బరాత్‌ను అలానే కొనసాగించారు. మరో సారి డయల్ 100కు ఫోన్ రావడంతో పోలీసులు మళ్లీ వచ్చారు. ఇది చూసిన బ్యాండ్ బృందం వారి సామాన్లు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బ్యాండ్ తో కూడిన ఆటోను వేగంగా ముందుకు నడిపారు. అదే సమయంలో ఆ వైపున వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. బ్యాండ్ ఆటోలో ఉన్న గుండప్ప, సంతోష్ గాయాలయ్యాయి. ధ్వంసమైన తన ఆటోను చూసిన నరేశ్ ఒక్కసారిగా ఆవేదనకు గురై కిందపడిపోయాడు. ఆ సమయంలో బ్యాండ్ ఆటోకు ఉన్న ఇనుప హుక్ అతని తలకు తాకింది.
గాయంతోనే కొద్ది దూరం నడిచిన తర్వాత నరేశ్ కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అయితే మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తామని వివరించారు. ఈ ఘటన పై విచారణాధికారిగా మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌ను నియమించినట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- death case
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

