హైదరాబాద్: ఆన్లైన్ డేటింగ్‌కు యువకుడు బలయ్యాడు. నగ్నవీడియోలను చూపించి మహిళ బెదిరిస్తుండటంతో పరువు పోతుందని భావించిన యుకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివశంకర్ (24) అనే యువకుడు నివాసముంటున్నాడు. కొన్నిరోజుల క్రితం అతనికి డేటింగ్ యాప్‌లో ఓ మహిళ పరిచయమయింది. ఈక్రమంలో ఆమెతో ఆ యువకుడు వీడియో కాల్లో నగ్నంగా మాట్లాడు. దీనిని ఆమె రికార్డు చేసింది. ఆ వీడియోను చూపించి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఈ విషయం బయట తెలిస్తే తన పరువు పోతుందని భావించిన శివశంకర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.