హైదరాబాద్: నగరంలోని మల్లాపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. మల్లాపూర్‌లోని ఓ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది (Cylinder blast). దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పేలుడు ధాటికి బేకరీ షెట్టర్లు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.