హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో సోడా తయారీకి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. అనంతరం అది బిల్డింగ్ పై అంతస్తులో ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో ఉన్న సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. అప్రమత్తమైన నిర్వాహకుడు సిలిండర్లను ప్రమాద స్థలానికి దూరంగా తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ హాని జరుగలేదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.