ప్లాస్మాదానానికి ముందుకురండి

- ఒక్కరి ప్లాస్మా ఇద్దరికి ఆయువు..
- ఇప్పటికీ 8 వేలమంది ప్లాస్మాదానం
- మొదటి దశలో 8 వేల మంది ప్లాస్మా దానం
- కోలుకున్న 14 వేల మంది
- రెండో దశలో ఇప్పటికే 1600 మంది..
- ప్లాస్మా దానం కోసం సైబరాబాద్‌లో కొవిడ్ సెంటర్
- 24 గంటలు పనిచేస్తున్న సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ సెంటర్
- ప్లాస్మాదానంతో 98 శాతం ఫలితాలు
విషమ పరిస్థితుల్లోనూ సైబరాబాద్ పోలీసులు నగరవాసులకు అండగా నిలుస్తున్నారు. ఓ వైపు శాంతిభద్రతలను పరిరక్షిస్తూనే మరోవైపు మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాక వైరస్ బారిన పడి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు ప్లాస్మాను సేకరిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు ప్రారంభించిన కొవిడ్ కంట్రోల్ రూం సేవలు దాదాపు 14 వేల మందికి ఉపయోగపడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఆపత్కాలంలో పోలీసు శాఖ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.
24 గంటల పాటు..
- సైబరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూంలో మొత్తం 20 మంది పోలీసు అధికారులు 24 గంటల పాటు పని చేస్తున్నారు.
- కాల్ సెంటర్(9490617440)కు వచ్చే ఫోన్లో వివరాలు తీసుకుంటున్నారు.
- ప్లాస్మా దాతలను వెతికి అవసరం ఉన్న వారి వద్దకు వాహనం ఇచ్చి పంపుతున్నారు.
- అనంతరం ప్లాస్మా అందుకున్న రోగి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.
- ఇంతేకాకుండా స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేసేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
- ఇందుకోసం పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- సోషల్ మీడియాలోనూ ప్లాస్మా దానం ఆవశ్యకతను వివరిస్తున్నారు. దీనికి తోడు అవసరం ఉన్న వారికి అంబులెన్స్‌లను పంపుతున్నారు.
- రోజుకు దాదాపు 500 ఫోన్లను అటెండ్ చేస్తూ కొవిడ్ రోగులకు కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు.
- మొదటి దశలో సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ సిబ్బంది దాదాపు ఆరు వేల మంది నుంచి ప్లాస్మాను సేకరించి పదివేల మందికి అందేలా చూశారు.
- అలా అందుకున్న వారిలో 98 శాతం మంది ఆరోగ్యంగా ఉన్నారు.
- రెండో దశలో ఇప్పటి వరకు 1600 మందితో ప్లాస్మా దానం చేయించి 4000 మందికి మేలు చేశారు.
- ప్రస్తుతం ఒక్కో రోజుకు 200 మందికి ప్లాస్మా కావాలని విజ్ఞప్తులు అందుతుండగా నమోదు చేసుకుంటున్నారు.
- ఆ బ్లడ్ గ్రూపు వారు అందుబాటులోకి రాగానే బాధితులకు ఫోన్ చేసి వివరాలు అందిస్తున్నారు.
- సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ సిబ్బంది సేవల్లో పలు స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ వాలంటీర్లు పాలు పంచుకుంటున్నారు.
స్వచ్ఛందంగా ముందుకు రండి..
- కొవిడ్‌ను జయించిన వారు ప్లాస్మాను దానం చేయాలి.
- ఒకరి ప్లాస్మా ఇద్దరి ప్రాణాలను కాపాడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి.
- ప్లాస్మా దానం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- ప్రస్తుతం ప్రతిరోజు 200కు పైగా ప్లాస్మా కావాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.
- కొవిడ్‌ను జయించిన వారు తప్పక ప్లాస్మా దానం చేయాలి.
- అంతేకాక ప్రతిఒక్కరూ మహమ్మారి బారిన పడకుండా కచ్చితంగా మాస్క్‌లు ధరించాలి.
- భౌతిక దూరం పాటించాలి.
- ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. – హనుమంతరావు, ఏసీపీ సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ రూం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

