Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Cyberabad Police | సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలం గాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరి ధిలో పోలీసు గస్తీ గతి తప్పుతోంది. ముఖ్యంగా భూ దందాలు, ఇతర సెటిల్మెంట్లతో కొందరు ఎస్ఐలు, సీఐలు, ఏసీ పీలు, డీసీపీలు బిజీ అవుతున్నారనే విమ ర్శలు వినిపిస్తున్నాయి.
Cyberabad Police | సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలం గాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరి ధిలో పోలీసు గస్తీ గతి తప్పుతోంది. మెజార్టీ ఎస్చ్లు ఏరియాలలో రౌండ్స్ తిరగడం మర్చిపోయి, ఠాణాలకే పరిమితమవుతు న్నారు. ముఖ్యంగా భూ దందాలు, ఇతర సెటిల్మెంట్లతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొందరు ఎస్ఐలు, సీఐలు, ఏసీ పీలు, డీసీపీలు బిజీ అవుతున్నారనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. సైబరాబాద్ లో పోస్టింగ్ అంటేనే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవచ్చనే ఆలోచనతో చాలామంది అధికా రులు అక్కడ పోస్టింగ్ కోసం డిపార్ట్మెంట్ లోని పెద్దల వద్ద పైరవీలు చేస్తుంటారని సమాచారం. అనుకున్న పోస్టింగ్ పొందిన తర్వాత ఇక పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందే క్రమంలో సదరు అధికారులు బిజీ అయిపో తుంటారనే విమర్శలున్నాయి.
శాంతిభద్రతలపై సడలుతున్న పట్టు
పెట్టుబడుల పోస్టుంగ్లతో కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు పట్టుసడలుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మంది అధికారులు విధుల్లో సింహభాగం సమయాన్ని తమ పెట్టుబడిని రాబడిగా మార్చుకోవడంలోను, తమను ఆశీర్వదించిన పెద్దలకు సేవలు అందించడంతోనే సరిపోవ డంతో.. ప్రజా సమస్యలపై దృష్టిపెట్టలేకపోతున్నారనే టాక్. దీంతో కమిషనరేట్ పరిధిలో గతంలో కంటే ఇప్పుడు దోపిడీ దొంగలు, సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు. కమిషనరేట్ పరిధిలో హత్యలు, అత్యాచా రాలు వంటి నేరాలు పెరగిపోతుండటమే ఇందుకు ఉదాహరణ.
ప్రయాణ ఖర్చులు నిందితుల నుంచే వసూలు !
ఏదైనా కేసులో నిందితులను పట్టుకున్నప్పుడు వారిని విచారించి, జైలుకు పంపే వరకు పూర్తి బాధ్యత పోలీసులదే. కాని ప్రస్తుతం కాలం మారింది. నిందితులను అరెస్టు చేసే సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తీసుకెళ్లడం, అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లడానికి అవసరమైన రవాణా ఖర్చులను నిందితుల కుటుంబ సభ్యులతోనే వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక దొంగతనం కేసులో నిందితులను వైద్య పరీక్షలు జరిపించి, రిమాండ్ తరువాత జైలుకు పంపించేందుకు అవసరమైన ఆటో చార్జీలను నిందితుడి కుటుంబ సభ్యుల నుంచే వసూలు చేయడం గమనార్హం. ఇది ఒక్క సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే కాదని కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆరో పణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

