Metalloids Tech | కొంప ముంచిన దురాశ.. తక్కువ కాలంలో ఎక్కువ రాబడి అంటూ మెటలాయిడ్స్ టెక్నాలజీస్ బురిడీ
మా సంస్థలో పెట్టుబడి పెట్టండి.. అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వస్తుంది..’ అంటూ మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన ఒక నకిలీ సంస్థ ఎండీని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో అరెస్టు చేశారు.
- పెట్టుబడుల పేరుతో రూ.70 కోట్ల వసూలు
- పశ్చిమ బెంగాల్లో సంస్థ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
Metalloids Tech | సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): మా సంస్థలో పెట్టుబడి పెట్టండి.. అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వస్తుంది..’ అంటూ మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన ఒక నకిలీ సంస్థ ఎండీని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో అరెస్టు చేశారు. నిందితురాలిని గురువారం నగరానికి తరలించి, రిమాండ్ చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్, కోల్‌కత్తాకు చెందిన మౌసమి బిశ్వాస్, జయంత్ బిశ్వాస్ దంపతులు. ఉపాధి కోసం నగరానికి వచ్చి మాదాపూర్‌లో ఉంటున్నారు. అయితే, తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలనుకున్న ఈ దంపతులు.. స్థానికంగా ఒక సంస్థను స్థాపించి, అమాయకుల వద్ద నుంచి పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ కలిసి మాదాపూర్‌లో ‘మెటలాయిడ్స్ టెక్నాలజీస్ ప్రై.లి.’ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని నమ్మబలికారు. దీనికి ఆకర్శితులైన అమాయక ప్రజల వద్ద నుంచి పెట్టుబడుల పేరుతో వసూలు చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో కొంత మందికి రిటర్న్స్ చెల్లించి నమ్మకం కలిగించారు.
దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాగానే, దాదాపు రూ.70కోట్ల వరకు వసూలు చేసి, బిచాణా ఎత్తేశారు. రాబడితో పాటు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి చెల్లించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నగరానికి చెందిన టి.శ్రీధర్, ఇతర బాధితులతో కలిసి తమకు జరిగిన మోసంపై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు.. నేరం జరిగిన ప్రాంతం మాదాపూర్ కావడంతో కేసును సైబరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు మరోసారి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు కోల్‌కత్తాలో ఉంటున్నట్లు సమాచారం అందుకున్న ఈఓడబ్ల్యూ బృందం అక్కడకు వెళ్లి సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరించిన మౌసమి బిశ్వాస్(49)ను ఈ నెల 22న అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితురాలిని నగరంలోని ఈఓడబ్ల్యూ ఠాణాకు తీసుకువచ్చి అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎండీగా వ్యవహరించిన మౌసమి భర్త జయంత్ బిశ్వాస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు
.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

