సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): అమెజాన్ డీలర్‌షిప్‌ను పిన్‌కోడ్ ఆధారంగా కేటాయిస్తామని నమ్మించిన సైబర్‌నేరగాళ్లు.. ఓ వ్యాపారికి బురిడీ కొట్టించారు. మియాపూర్‌కు చెందిన వ్యాపారికి ఇటీవల ఆగంతకులు ఫోన్ చేసి 500011, 500015 పిన్ కోడ్ ప్రాంతాలకు అమెజాన్ డీలర్‌షిప్‌ను కేటాయిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు చెల్లించాలని చెప్పడంతో సదరు వ్యాపారి రెండు పిన్ కోడ్లకు డీలర్షిప్ తీసుకుంటానని.. లక్ష రూపాయలు కట్టాడు.
మూడు నెలల్లో డీలర్షిప్ వస్తుందని.. మీరు వ్యాపారం భారీ ఎత్తున చేసుకోవచ్చని..పత్రాలు సిద్ధమవుతున్నాయని, మధ్యలో ఫోన్లు చేసి ఆగంతకులు నమ్మించారు. 3 నెలల తర్వాత కూడా ఎలాంటి పత్రాలు రాకపోవడంతో అనుమానించిన బాధితుడు ఫోన్లు చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.