CV Anand | హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
హైదరాబాద్ 61వ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస్ రెడ్డి నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ 61వ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస్ రెడ్డి నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సీపీగా రెండోసారి బాధ్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు. నగరంలో లా అండ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని వెల్లడించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని.. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్నారు.
వినాయక నిమజ్జనం చాలా కీలకమైన అంశం అని చెప్పారు. నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విన్నానని.. ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. హత్యలు, అత్యాచారాలు, లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
కాగా, సీపీగా సీవీ ఆనంద్ నియామకంతో ఏదాడి కాలంలోనే నాలుగో కొత్వాల్‌గా రికార్డులకు ఎక్కారు. మొదటి, నాలుగు స్థానాలు ఆనంద్‌వే కావడం గమనార్హం. మధ్యలో మాత్రం శాండిల్య, శ్రీనివాసరెడ్డి పని చేశారు. ఆయన తొలిసారిగా 2021లో హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఆ ఏడాది డిసెంబర్ 25 నుంచి గతేడాది అక్టోబర్ 12 వరకు విధులు నిర్వర్తించారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది డిసెంబర్ 13 వరకు సందీప్ శాండిల్య పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస రెడ్డిని ఈ నెల 7న బదిలీ చేసిన ప్రభుత్వం.. మళ్లీ సీవీ ఆనంద్‌నే సీపీగా నియమించింది. దీంతో 21 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌కు డీజీపీ స్థాయి అధికారిని కొత్వాల్‌గా నియమించడం ఇదే మొదటిసారి.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తొలి కొత్వాల్ హసన్ అలీ ఖాన్ నుంచి గత ఏడాది పోలీసు కమిషనర్‌గా వచి్చన కొత్తకోట శ్రీనివాసరెడ్డి వరకు మొత్తం 60 మంది అధికారులు ఈ పోస్టులో పని చేశారు. సీవీ ఆనంద్ సంఖ్య 61 కాగా.. ఇప్పటి వరకు ఏడుగురికి మాత్రమే రెండోసారి నగర పోలీసు చీఫ్‌గా పని చేసే అవకాశం దక్కింది. గతంలో సి.రంగస్వామి అయ్యంగర్, బీఎన్ కాలియా రావు, ఎస్పీ సత్తారు, కె.విజయరామారావు, ఆర్.ప్రభాకర్‌రావు, వి.అప్పారావు, ఆర్పీ సింగ్‌లకు మాత్రమే ఇలా పని చేయగలిగారు. 2003లో ఆర్పీ సింగ్ తర్వాత 21 ఏళ్లకు సీవీ ఆనంద్‌కు ఈ అరుదైన రికార్డు సాధించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

