విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే.. రాచకొండ సీపీ సుధీర్‌బాబు కాసేపు ఇలా బ్యాటింగ్ చేసి.. సందడి చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2024ను ప్రారంభించిన ఆయన.. క్రీడలు వ్యక్తుల మానసిక, శారీరక వికాసానికి ఎంతో అవసరమంటూ.. క్రీడల్లో గెలుపోటముల కంటే పోరాటం ముఖ్యమని చెప్పారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ)