గోల్నాక, ఏప్రిల్ 16ః వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన పాత నేరస్థుడిని అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్ తెలిపిన వివరాలు ఉన్నాయి. మల్లేపల్లికి చెందిన అబ్దుల్ మన్నార్(32)ఆటోడ్రైవర్. కాగా ఇతను 2014 నుంచి హైదరాబాద్, సైబరాబాద్ కమిషరేట్ల పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లో మొత్తం 31 చైన్ స్నాచింగ్, ఇతర దొంగతనం కేసుల్లో నిందుతుడు.. కాగా.. ఈనెల 14న అంబర్పేట ఇరానీ హోటల్ బస్ స్టాప్ వద్ద రిటైర్డ్ సైనికుడు చీర్ల రాముడు బంగారు గొలుసును లాక్కోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో అప్రమత్తమైన మాజీ సైనికుడు సమయస్పూర్తితో వ్యవహరించి మున్నార్ ను గట్టిగా పట్టుకున్నాడు.
వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో ఉన్నా లేకున్నా సైనికుడు ఎప్పటికీ సైనికుడేనని రాముడు మరో సారి నిరూపించారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కొనియాడారు. చైన్ స్నాచింగ్ కు యత్నించిన పాత నేరస్థుడిని సమయస్పూర్తితో వ్యవహరించి పోలీసులకు పట్టించిన మాజీ సైనికుడు చీర్ల రాముడును గురువారం సీపీ శాలువాతో సన్మానించి నగదు రివార్డును అందజేశారు.