జీహెచ్ఎంసీలో కొవిడ్ కంట్రోల్ రూం

- కరోనా సంబంధిత అంశాలపై 24/7 సమాచారం
- పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్
గ్రేటర్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు బల్దియా చర్యలను వేగి రం చేసింది. నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జీహెచ్ఎంసీలో కొవిడ్-19 కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. 24/7 ఈ కంట్రోల్ రూం పనిచేసే విధంగా, సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని అర్వింద్ కుమార్ ఆదేశించారు.
- నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున బయో వ్యర్థాలు వస్తున్నాయని, వీటిని తగు నిబంధనల ప్రకారం తీసి వేసేందుకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు చేపట్టిన చర్యలపై తనిఖీలు చేపట్టాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించారు.
- గత సంవత్సరంలో కరోనా మొదటి దశ నియంత్రణలో మిషన్ మోడ్‌తో పనిచేసిన విధంగానే ప్రస్తుతం కూడా పనిచేయాలన్నారు. కొవిడ్-19 సంబంధిత అంశాలపై నగరవాసుల అవసరాలను తీర్చడం, తగు సలహాలు, సూచనలు ఇవ్వడానికి జీహెచ్ఎంసీలో ప్రత్యేక నోడల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని అర్వింద్ కుమార్ అధికారులకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

