పైసలు ఇచ్చినా.. కనెక్షన్ ఇస్తలేరు..!
నగరంలోని రామ్‌నగర్ సెక్షన్ జమిస్తాన్‌పూర్‌కు చెందిన ఓ ఇంటికి సంబంధించి రూ.8.24లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఉంటేనే ఇస్తామంటూ నిబంధన విధించడంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు. డబ్బులు కట్టిన తర్వాత ఈ విషయం చెప్పడంతో ఏం చేయాలో తెలియక ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. టజీఎస్పీడీసీఎల్ అధికారులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు.
- జీహెచ్ఎంసీ, ఎస్పీడీసీఎల్ మధ్య సమన్వయం కరువు
- ఓసీ లేదంటూ డిస్కం అధికారుల సాకులు
- నిబంధనలు మారుస్తుండటంతో ఇక్కట్లు
- లక్షల రూపాయలు చెల్లించి ఎదురుచూపులు
- యాభైవేలకు పైగా భవనాలు చీకట్లోనే..
- వినియోగదారులకు తప్పని కరెంట్ తిప్పలు
సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): నగరంలోని రామ్‌నగర్ సెక్షన్ జమిస్తాన్‌పూర్‌కు చెందిన ఓ ఇంటికి సంబంధించి రూ.8.24లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఉంటేనే ఇస్తామంటూ నిబంధన విధించడంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు. డబ్బులు కట్టిన తర్వాత ఈ విషయం చెప్పడంతో ఏం చేయాలో తెలియక ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. టజీఎస్పీడీసీఎల్ అధికారులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. తమ సర్కిళ్లలో కరెంట్ కనెక్షన్లు ఇవ్వడానికి నిబంధనల పేరిట సతాయిస్తున్నారు. ఇప్పటికే కొత్తగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే ఓసీ తప్పనిసరి చేస్తూ డిస్కం పెట్టిన నిబంధనలు కరెంట్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తుండగా తాజాగా డిస్కం అధికారులు పెట్టిన నిబంధనలు వినియోగదారులకు మరింత సమస్య తెచ్చిపెడుతున్నాయి.
నిబంధనలు కఠిన తరం
నగరంలో ఎక్కడైనా నిర్మాణం జరిగి కొత్త కనెక్షన్ కావాలంటే ఓసీ కావాలంటూ డిస్కం రూల్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. వాటికి కరెంట్ ఇవ్వాలంటే ఓసీ తప్పనిసరి చేస్తూ ఉన్న నిబంధనలను అధికారులు కఠిన తరం చేశారు. కనెక్షన్ ఇవ్వాలంటే తప్పని సరిగా ఓసీ ఉండాలని, లేకుంటే భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేదే లేదంటూ తెగేసి చెప్పింది. దీంతో నగరంలో దాదాపు యాభైవేలకు పైగా భవనాలు ఓసీ లేక చీకట్లలోనే మగ్గుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇదే విషయాన్ని అక్కడి వినియోగదారులు కాంగ్రెస్ ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లి కొంత గలాటా చేశారు. అన్నిటికి ఓసీలు కావాలంటే అది చాలా కష్టమంటూ చెప్పడంతో డిస్కం అధికారులను పిలిచి ఏదో ఒక రకంగా వారికి కనెక్షన్లు ఇవ్వాలంటూ చెప్పారు. దీంతో అక్కడ ఉన్న నివాసాలకు కరెంట్ ఇచ్చారు.
అడ్డంకిగా మారిన కొత్త నిబంధన..
కనెక్షన్ ఇచ్చే సమయంలో మీటర్లు ఇవ్వడానికి ఓసీ తప్పనిసరి చేస్తూ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఇందుకోసం ఓసీలు తెచ్చుకుంటున్నారు. అయితే వారం పది రోజులుగా నగరంలో కనెక్షన్లకు కొత్త నిబంధన అడ్డంకిగా మారింది. జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే కనెక్షన్ ఇస్తామంటూ నిబంధన పెట్టిన డిస్కం కొత్తగా వర్క్ ఆర్డర్‌కు సైతం ఓసీ ఉండాలంటూ నిబంధన విధించడంతో వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే ఆయా భవనాల దగ్గర ట్రాన్స్ఫార్మర్ దిమ్మె కట్టి దానిపై ట్రాన్స్ఫార్మర్ ఉన్న ఫొటోను అప్లోడ్ చేయాలనేది జీహెచ్ఎంసీ నిబంధన. ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ కావాలంటే డిస్కం నుంచి వర్క్ ఆర్డర్ ఉండాలి. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఆర్డర్ తీసుకోవాలంటే ఓసీ కావాలని పెట్టిన నిబంధనతో వారు మండిపడుతున్నారు. తాము కనెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఈ నిబంధన పెడితే దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటామని, లక్షల రూపాయలు కట్టిన తర్వాత ఓసీ కావాలని అధికారులు చెప్పడం ఎంత వరకు కరెక్టని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

