గ్రీన్ ట్రాక్@ ఓఆర్ఆర్
ఇప్పటికే పచ్చదనంతో పరిఢవిల్లుతున్న ఔటర్ రింగ్ రోడ్డు.. ఇప్పుడు మరిన్ని పూల అందాలను సంతరించుకోనున్నది. ఐటీ కారిడార్‌లో 24 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ లోపలి వైపు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
- సైకిల్ ట్రాక్ పొడవునా పచ్చదనం
- రెండు వరసల్లో చెట్లు, పూల మొక్కల పెంపకం
- నిరంతర నీటి సరఫరాకు డ్రిప్ సిస్టం
సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే పచ్చదనంతో పరిఢవిల్లుతున్న ఔటర్ రింగ్ రోడ్డు.. ఇప్పుడు మరిన్ని పూల అందాలను సంతరించుకోనున్నది. ఐటీ కారిడార్‌లో 24 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ లోపలి వైపు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ట్రాక్ పొడవునా రెండు వరుసల్లో మొక్కలు నాటుతూ మరింత పచ్చదనం పెంపొందిస్తున్నారు. కవర్ బాక్స్ నిర్మిస్తూ అందులో రకరకాల చెట్లు, పూల మొక్కలు నాటుతున్నారు.
మొక్కల పరిరక్షణ కోసం పైప్‌లైన్ ద్వారా నిరంతరం నీటిని అందించేందుకు డ్రిప్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. నానక్‌రాంగూడ నుంచి మొదలయ్యే సైకిల్ ట్రాక్ నార్సింగి, మంచిరేవుల మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు కొనసాగుతుంది. అలాగే.. నార్సింగి నుంచి మై హోం అవతార్ జంక్షన్ నుంచి కోకాపేట మీదుగా కొల్లూరు వరకు మొత్తం 24 కి.మీ. మేర నిర్మాణం జరుగుతున్నది. వేసవి పూర్తయ్యే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పనులు చేపడుతున్నది. ఇప్పటికే 50-60 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.

పచ్చదనానికి కేరాఫ్ ఓఆర్ఆర్…
రవాణా మార్గాలను పచ్చదనంతో తీర్చిదిద్దడం అంత తేలికైన పనికాదని, కానీ.. దీన్ని హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ ఆచరణలో చేసి చూపించారని గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిస్టిట్యూట్ అధ్యక్షులు ఎరిక్ సోల్హెమ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన ప్రశంసించినట్లుగానే సైకిల్ ట్రాక్ పొడవునా రెండు వరసల్లో మొక్కలను నాటుతూ పచ్చదనాన్ని మరింతగా పెంపెందిస్తున్నారు. దీనికితోడు ఓఆర్ఆర్ వెంబడి ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లలో ప్రయాణించే వారు కుటుంబంతో కలిసి చెట్ల కింద సేద తీరడంతో పాటు తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలను ఆరగించి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించే ఏర్పాట్లూ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు..
ఔటర్, సర్వీసు రోడ్లపై ప్రయాణం చేస్తున్న వారు ఇక్కడి పచ్చదనంపై తమ అనుభూతిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సెల్ఫీలను షేర్ చేస్తూ ఔటర్ గ్రీనరీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు హైదరాబాద్‌లోని తమ ప్రాజెక్టుల గురించి చెప్పే ముందు ఓఆర్ఆర్ గురించి వివరిస్తూ డ్రోన్స్‌తో తీసిన వీడియోలు, ఫొటోలను తమ వ్యాపార కార్యకలాపాలకు విస్తృతంగా వాడుకుంటున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

