లింక్ రోడ్లతో.. ట్రాఫిక్‌కు చెక్
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని సాగర్ సొసైటీ సిగ్నల్ వద్ద నుంచి కృష్ణానగర్ ప్రధాన రహదారిపై ఉన్న గ్రీన్ బావార్చీ హోటల్దాకా కొత్తగా బీటీ రోడ్డు వేశారు.
- జూబ్లీహిల్స్ డివిజన్లో మూడులింక్ రోడ్ల నిర్మాణం
- ప్రధాన రహదారులపై తగ్గనున్న ట్రాఫిక్
నగరంలోనే అత్యంత రద్దీ కలిగిన ప్రాంతమైన జూబ్లీహిల్స్ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు లింక్ రోడ్లను అభివృద్ధి చేయడంపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రధాన రోడ్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో పాటు ప్రధాన రోడ్లకు ప్రత్యామ్నాయంగా లింక్ రోడ్లను తీర్చిదిద్దుతున్నారు.
-బంజారాహిల్స్,ఫిబ్రవరి 6
- జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని సాగర్ సొసైటీ సిగ్నల్ వద్ద నుంచి కృష్ణానగర్ ప్రధాన రహదారిపై ఉన్న గ్రీన్ బావార్చీ హోటల్దాకా కొత్తగా బీటీ రోడ్డు వేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లోని ముగ్ద్దా షోరూం, సాగర్ సొసైటీ, ఎంపీ బీబీ పాటిల్ నివాసం, ఆంధ్రాబ్యాంక్ మీదుగా కృష్ణానగర్ ప్రధాన రోడ్డు వరకు సుమారు కిలోమీటర్ మేర ఇటీవల సీఆర్ఎంపీ ఆధ్వర్యంలో రూ.85లక్షల వ్యయంతో డబుల్ లేన్ బీటీ రోడ్డును వేశారు. సాగర్ సొసైటీకి, కమలాపురి కాలనీకి మధ్య ఉన్న కొంత రోడ్డును జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ద్వారా వీడీసీసీ రోడ్డుగా మార్చనున్నారు. ప్రస్తుతం ఇందిరానగర్ మహిళా మండలి వద్ద సాగుతున్న వీడీసీసీ పనులు ముగిసిన వెంటనే కమలాపురికాలనీ వద్ద రోడ్డు పనులు ప్రారంభించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం సాగర్ సొసైటీ నుంచి చల్లా కంటి ఆస్పత్రి మీదుగా కమలాపురి ప్రధాన రోడ్డు మీదకు వెళ్లే ట్రాఫిక్‌లో సగభాగం కొత్తగా అభివృద్ధి చేస్తున్న లింక్ రోడ్డు ద్వారా గ్రీన్ బావార్చీ వైపు వెళ్తుందని ట్రాఫిక్ అధికారులు అంచనా వేస్తున్నారు.
- జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని పెద్దమ్మగుడినుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలు నీరూస్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. ఈ జంక్షన్ మీద ఒత్తిడి తగ్గించేందుకు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 37 మీదుగా దస్పల్లా హోటల్ వైప్ లింక్‌రోడ్డు వేస్తున్నారు. సుమారు రూ.26లక్షలతో చేపట్టిన ఈ లింక్ రోడ్డు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటితో పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లింక్ రోడ్డు నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి.
- జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5నుంచి అన్నపూర్ణ స్టూడియో మీదుగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2 వరకు కొత్త లింక్ రోడ్డు వేయడం ద్వారా రెండువైపులా ప్రధాన రహదారులపై రద్దీని కొంతమేర తగ్గించవచ్చని ట్రాఫిక్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
లింక్‌రోడ్ల నిర్మాణంతో ఉపయోగం
జూబ్లీహిల్స్ డివిజన్లో ప్రధాన రోడ్లమీద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు సీఆర్ఎంపీ ఆధ్వర్యంలో లింక్ రోడ్లను అభివృద్ధ్ది చేస్తున్నారు. సాగర్ సొసైటీ నుంచి కృష్ణానగర్ మెయిన్ రోడ్డు వరకుకా సీఆర్ఎంపీ ఆధ్వర్యంలో రోడ్డుపనులు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కమలాపురి కాలనీ సమీపంలో వీడీసీసీ రోడ్డు పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే స్థానికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అవసరమైన చోట్లలో లింక్ రోడ్లను అభివృద్ధ్ది చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
హరేరామ్, డీఈ, జీహెచ్ఎంసీ సర్కిల్-18
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

