Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో లేను.. బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నడుమ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నడుమ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. టికెట్ కోసం ఎవరిని అడలేదని తెలిపారు. అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థి ఎవరైనా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు.
కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లు జూబ్లీహిల్స్ సీటు ఆశిస్తున్నారని ప్రచారం ఉంది.వీరిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ సర్కార్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో బొంతు రామ్మోహన్ తాను అభ్యర్థి రేసులో లేనని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మరో ఆశావహ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై ఇవాళ క్రిమినల్ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 4న యూసుఫ్‌గూడలో ఓటర్లు కార్డులను పంపిణీ చేశారు. ఈవ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకున్నది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి, యూసుఫ్‌గూడ సర్కిల్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మధురానగర్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ యాదవ్‌పై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేశారు.

కాగా, హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టి, ఫలితాన్ని ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21వ తేదీని తుది గడువుగా విధించారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికకు సోమవారం షెడ్యూల్ జారీకావడంతో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశంలో ప్రకటించారు. నవంబర్ 14న యూసుఫ్‌గూడలోని కేవీఆర్ స్టేడియం లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతిచెందిన నేపథ్యంలో ఈ ఉపఎన్నిక జరగనున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

