22A Victim | కాంగ్రెస్ సర్కార్ ప్రజల సొమ్ము కాజేసేందుకు 22A సెక్షన్ పేరుతో హైదరాబాద్ వాసులను భయాందోళలకు గురి చేస్తుందని బాధితులు వాపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని వసంత్ నగర్ డివిజన్లో ఇప్పటికే పలువురు 22A బాధితులు తమ ఆవేదనను పంచుకున్నారు.
తాజాగా కూకట్ పల్లి పరిధిలో మరో బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. పక్కనే ఉన్న 200 ఎకరాల మీద రేవంత్ ప్రభుత్వం కన్ను పడింది అందుకే మా భూములు కూడా 22Aలో పెట్టారని ఓ బాధితుడు ఫైర్ అయ్యాడు. మీడియాతో మాట్లాడుతూ.. కష్టపడి ఇల్లు కట్టుకున్నం.. ఇప్పుడు 22ఏ కింద ఉంది అంటున్నరు.. ఎవరైనా గవర్నమెంట్ వాళ్లు వస్తే రోడ్డుకీడుస్తాం.. దిగ్భంధం చేస్తాం రానీయండి. వాళ్ల సంగతేంటో చూస్తాం. కాలనీ అంతా మేం వదిలిపెడతామా..రమ్మనండి ఇక్కడికి.. మేమెళ్లం. ఎవరికైనా కూతుళ్ల పెళ్లిళ్లున్నాయి.. పిల్లలు చదువుకోవాలని యూఎస్కెళ్లాలంటే వాళ్లకు ఇబ్బంది. ఇందులో ఇప్పుడు బిల్డింగ్ కట్టేందుకు పర్మిషన్ లేదు.. రిజిస్ట్రేషన్ లేదు.. డెవలప్మెంట్ ఎక్కడిదక్కడే ఆగిపోయింది.. ప్రభుత్వానికి ఆదాయమే లేదు..వాళ్లకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తది.. అందుకే భూములు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నరని ఆరోపించాడు.
ఇదే సర్వేనంబర్ మీద వెనకాలున్న ఓపెన్ ల్యాండ్ అంతా ఒక 100 ఎకరాలుంది. దాని మీద కన్నేసి ఇదంతా పెట్టారు.. ఈ 100 ఎకరాల కోసం జేఎన్టీయూ నుంచి మా దగ్గరికి వరకు ఈ రూల్ పెట్టారు. రోడ్డుకు ఎదురుగా సర్వే నంబర్ 172లో మరో 100 ఎకరాలుంది. దీన్ని కూడా అదే జాబితాలో పెట్టారు. ఆ భూముల కోసం ఇదంతా డ్రామా చేస్తున్నరు. మా దగ్గరికొస్తే మా తడాఖా ఏంటో చూపిస్తాం. ఇక్కడ ఎకరం 200 కోట్ల రూపాయలుంటది.. ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ.. అందుకే వీళ్లు 22ఏ పేరుతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
పక్కనే ఉన్న 200 ఎకరాల మీద రేవంత్ ప్రభుత్వం కన్ను పడింది అందుకే మా భూములు కూడా 22Aలో పెట్టారు
ఆ భూములు అమ్మితే రూ. 40 వేల కోట్లు వస్తాయి అందుకే ఇదంతా చేస్తున్నారు
రేపు ఎవరైనా మా భూముల జోలికి వస్తే ఊరుకోము
ఇలా చేస్తే రేపు ఎవడు పెట్టుబడుల కోసం కూడా రాడు
– 22A బాధితులు https://t.co/tPIGqATAnF pic.twitter.com/ND1OTFe1sn
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026
Donald Trump | ఆయన బతికే ఉన్నా తీవ్ర గాయాలతో ఉన్నారు : డొనాల్డ్ ట్రంప్
Shoaib Akhtar | క్రికెట్ కోసం బాలీవుడ్ చాన్స్ వదులుకున్నా : షోయబ్ అక్తర్
Akhilesh Yadav | అంకిత్ బలియాన్ హత్య జాట్ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్ యాదవ్