Outsourcing Employees | ‘ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని అధికారంలోకి కాంగ్రెస్ సర్కార్.. కానీ ఆ ఊసే లేదు’
Outsourcing Employees | వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మూడు నెలల నుండి మాకు జీతాలు లేవు.. బైట వడ్డీలకు తెచ్చి ఇంటి రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నామని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Outsourcing Employees | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేం ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని హామీనిచ్చింది. అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి కూడా రెండున్నరేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ దాని అలాంటి ఊసే లేదు. వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మూడు నెలల నుండి మాకు జీతాలు లేవు.. బైట వడ్డీలకు తెచ్చి ఇంటి రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నామని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ఒకటే తారీఖున జీతమేస్తమన్నరు.. ఇప్పటిదాకా రెన్యూవల్ కూడా లేదు. ఏప్రిల్ నుంచి రెన్యూవల్ కావాలి.. ఏప్రిల్, మే, జూన్ కావొస్తుంది.. ఈ మూడు నెలల పెండింగ్ వేతనాలు కూడా అట్లనే ఉన్నాయి. మాకు వేరే ఏ సౌకర్యాలు కూడా లేవు. ఇంక్రిమెంట్లు లేవు.. డీఏలు లేవు. కనీసం జీతమన్నా ఇయ్యాలి.. అది కూడా లేదు కదా.. ఒకటో తారీఖు అని పేపర్లలో, మీడియాలో వస్తుంది కానీ.. దానికి సంబంధించిన ఫైల్స్ కదలడం కానీ..ఉద్యోగులకు జీతాలు క్రెడిట్ చేయడం కానీ ఏం చేయడం లేదు. బయట నుంచి వడ్డీలకు తెచ్చుకోవడం కానీ.. బంగారం తాకట్టు పెట్టుకోవడం కానీ చేసి పిల్లలకు బుక్స్ కొంటున్నం.. ఫీజులు కానీ కడుతున్నం. అద్దె కూడా.. పాలబిల్లు, కిరాణం బిల్లు ఇప్పుడు అన్నీ రేట్లు పెరిగినయ్.
యుద్దం కారణంగా 2021 నుంచి ఇప్పటివరకు గదే జీతం ఉంది.. 15 వేలుంటే అంతే.. 20 వేలు ఉంటే అంతే ఉంది.. మిగితా ధరలన్నీ పెరిగినయ్ కానీ మావి మాత్రం రూపాయి కూడా పెరుగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఔట్ సోర్సింగ్ విధానాన్ని మేము రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది
కానీ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా దాని మీద ఎలాంటి ఊసే లేదు
వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా
మూడు నెలల నుండి మాకు జీతాలు… https://t.co/CYP4k6iuWh pic.twitter.com/zP2RqVG56s
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2026
Read Also :
Volcano eruption | అగ్నిపర్వతం నుంచి భారీ విస్ఫోటనం.. పరుగులు తీసిన పర్యాటకులు
Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం.. ఒకటి కాదు మూడు భారీ ట్రీట్స్ ప్లాన్ చేస్తున్న రెబల్ స్టార్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

