మూసాపేట్ భూములపై వెనక్కి తగ్గిన సర్కార్
స్థానిక ప్రయోజనాలను కాలరాసి, ఖజానా నింపుకొనేలా తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కోర్ సిటీలో కీలకమైన భూమిని రక్షించడంలో బీఆర్ఎస్ విజయం సాధించింది.
- 15 ఎకరాల భూమిని వేలానికి పెట్టిన హెచ్ఎండీఏ
- బీఆర్ఎస్ ఒత్తిడితో జాబితా నుంచి తొలగింపు
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : స్థానిక ప్రయోజనాలను కాలరాసి, ఖజానా నింపుకొనేలా తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కోర్ సిటీలో కీలకమైన భూమిని రక్షించడంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆదాయం కోసం ఒకప్పటి హుడా మాస్టర్ ప్లాన్‌లోని మూసాపేటలో 15 ఎకరాల విస్తీర్ణంలో భూమిని వేలానికి పెట్టింది. పారిశ్రామిక వాడల రవాణా పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ స్థలాన్ని కేటాయిస్తే.. ఇప్పుడున్న సర్కారు వీటిపై బేరసారాలు చేయడంపై మండిపడింది.
స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వాన్ని కలిసి, హెచ్ఎండీఏ నిర్వహించే భూముల వేలం నుంచి మూసాపేట్ ల్యాండ్ పార్శిల్ తొలగించాలని స్పష్టం చేశారు. బహుళ ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని భూముల వేలాన్ని నిలిపివేయాలని బీఆర్ఎస్ చేసిన డిమాండ్‌తో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. కాదు కూడదని, వేలానికి దిగితే… భూముల కోసం పోరాటమే ఉంటుందని తేల్చి చెప్పడంతో.. ఎట్టకేలకు వేలం జాబితా నుంచి మూసాపేట్ ల్యాండ్ పార్శిల్‌ను తొలగించింది. హుడా ఆధ్వర్యంలో కూకట్పల్లి మండలంలోని మూసాపేట్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 121-141, 146, 147, 155-157లోని 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల విస్తీర్ణంలోని రెండు సైట్లను విక్రయించడానికి హెచ్ఎండీఏ ఏర్పాటు చేసింది.
ఎకరం రూ. 75 కోట్ల చొప్పున విక్రయించనున్న ఈ భూములను కూకట్పల్లి వాసుల కోసం మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఈ అంశంపై రాష్ట్ర సర్కారు పెద్దలను కలిసి మూసాపేట్ భూముల ఆవశ్యకతను వివరించారు. భూముల వేలానికి కంటే, స్థానికుల కోసం మౌలిక వసతులను కల్పించే భవనాలు, మైదానాల నిర్మాణానికి ఇవ్వాలని సూచించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ భూములను వేలం వేయడం ద్వారా ఖజానా నిండుతుందని భావించింది. తొలుత జాబితాలో పేర్కొన్నా.. చివరకు భూముల పరిరక్షణకు పెరుగుతున్న మద్దతుపై ఈ నిర్ణయం బెడిసికొట్టక ముందే కాంగ్రెస్ వెనక్కి తగ్గింది.
కోర్ సిటీలో విశాలమైన ల్యాండ్ పార్శిల్..
దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతాన్ని ట్రక్ పార్క్‌గా వినియోగించారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా నగరానికి వచ్చే వీలు లేకుండా, శివారు ప్రాంతంలోనే ట్రక్కులు, భారీ వాహనాలు నిలుపుకొనేందుకు ఏర్పాటు చేశారు. దీంతో నగరంలో భారీ వాహనాల తాకిడి తగ్గింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ భూములను విక్రయించాలనే నిర్ణయంతో భారీ ల్యాండ్ పార్శిల్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. శరవేగంగా పెరుగుతున్న జనాభాతో కిక్కిరిపోతున్న మహానగరంలో కనుచూపు మేర ఖాళీ జాగాలు లేకుండా పోతాయని స్థానికులు మండిపడ్డారు. భవిష్యతులో వచ్చే భారీ నిర్మాణ కార్యకలాపాలపై ఆవేదన చెందారు. వేలం కంటే ముందుకు స్థానిక అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం వేలం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ల్యాండ్ పార్శిల్‌ను జాబితా నుంచి తొలగించింది. దీంతో డిసెంబర్ 5న కేవలం కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్ ప్రాజెక్టులోని ల్యాండ్ పార్శిల్‌కు మాత్రమే హెచ్ఎండీఏ వేలం నిర్వహించనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

