కంటోన్మెంట్ అంటే సాయన్న..సాయన్న అంటే కంటోన్మెంట్
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోలేమని, అజాత శత్రువైన ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు.
- ఆయన సేవలు చిరస్మరణీయం
- లాస్య నందిత మరణం దురదృష్టకరం
- శాసనసభలో ఎమ్మెల్యేల సంతాపం
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోలేమని, అజాత శత్రువైన ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. మంగళవారం అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందితల మృతి పట్ల శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానం పై వారు మాట్లాడారు. ఏడాది వ్యవధిలోపే తండ్రీబిడ్డలు మరణించడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా సభలో సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
కంటోన్మెంట్ అంటే సాయన్న
కంటోన్మెంట్ అంటే సాయన్న.. సాయన్న అంటే కంటోన్మెంట్ అనేంతగా ఎనలేని సేవచేశారు. సాయన్న నేను 1994లో ఇద్దరం ఒకేసారి శాసనసభకు వచ్చాం. కలిసి పనిచేశాం. మృదుస్వభావి. అనారోగ్యంతో నడవలేని స్థితిలో కూడా నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం పాటుపడ్డ వ్యక్తి సాయన్న. ముఠాగోపాల్, సాయన్న ఒకే స్కూటర్‌పై తిరిగేవారు. నియోజకవర్గ ప్రజలతో సాయన్న కుటుంబానికి 30 ఏండ్ల అనుబంధం ఉన్నది. ప్రజల మధ్య ఉండాలని పరితపించే వ్యక్తి సాయన్న. లాస్య ఎమ్మెల్యేగా గెలిచిన రెండు నెలల 20 రోజులకే చనిపోయింది. ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ప్రజలకు జీవితాన్ని అంకితం చేసిన కుటుంబంలో ఏడాది కాకుండానే తండ్రి బిడ్డ చనిపోవడం.. కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.లాస్య కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న
-ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్
లాస్య కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించాలి
సొంత ఇల్లు కూడా లేని లాస్య కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వాలి. సాయన్న గొప్ప వ్యక్తి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అవినీతిరహితంగా పనిచేశారు. సొంత ఇల్లు కూడా లేకుండా సాయన్న కుటుంబం ప్రజలకు సేవలు అందించింది. వారి కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్న. లాస్య కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నా
-మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
చురుకుగా ఉండేవారు
లాస్య నందిత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సాయన్న నియోజకవర్గం పేరుతోనే పిలవబడేవారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయన సుపరిచితుడు. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆయన బిడ్డలు కూడా ఎంతో చురుకుగా ప్రజాక్షేత్రంలో ఉండేవారు. ప్రజల మన్ననలు పొందారు.
– కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్
సాయన్న, నేను మంచి మిత్రులం
నేను, సాయన్న మంచి మిత్రులం. సాయన్న సిండికేట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తూ రాజకీయాలపై ఆసక్తిచూపేవారు. దోమల్‌గూడ డివిజన్ నుంచి తొలుత కార్పొరేటర్‌గా పోటీచేసి తొలుత కొద్ది ఓట్లతో ఓడిపోయారు. తర్వాత కంటోన్మెంట్ నుంచి గెలుపొందారు. ప్రజల కోసం చాలా కష్టపడ్డారు. డయాబెటిస్ కారణంగా సాయన్న ఒక కాలు బాగలేకపోయినప్పటికీ ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నించేవారు. సాయన్న అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన వారసురాలిగా లాస్య బరిలో నిలిచి గెలుపొందారు. చిన్న వయసులోనే లాస్య చనిపోవడం బాధాకరం.
– ముషీరాబాద్ ఎమ్మెల్యే, ముఠా గోపాల్
కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటు
నందిత కవాడీగూడ కార్పొరేటర్‌గా సేవలు అందించారు. లాస్య మరణం కంటోన్మెంట్ ప్రజలకు, అభిమానులకు తీరనిలోటు. ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆనాడు నాకు సాయన్న సలహాలు ఇవ్వడమే కారణం. ప్రత్యర్థులుగా పోటీలో ఉన్నా కంటోన్మెంట్లో నియోజకర్గ అభివృద్ధినే కోరుకొనేవాళ్లం. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్న
– కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

