అవినీతి, అక్రమాలను సహించను
రెండు రోజులుగా సీ అండ్ డీ (భవన నిర్మాణ) వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరుగురు జోనల్ కమిషనర్లతో కమిషనర్ రొనాల్డ్ రాస్ సమీక్షలు జరుపుతున్నారు. ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలను తరలింపు,
- జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్
సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రెండు రోజులుగా సీ అండ్ డీ (భవన నిర్మాణ) వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరుగురు జోనల్ కమిషనర్లతో కమిషనర్ రొనాల్డ్ రాస్ సమీక్షలు జరుపుతున్నారు. ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలను తరలింపు, అక్రమంగా నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌ను అరికట్టడంతో పాటు రోజూ డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు, ఏఎంవోహెచ్‌ల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని జోనల్ కమిషనర్లకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో కొన్ని జోనల్ కార్యాలయాల్లో లోపాలు ఉన్నాయని జోనల్ కమిషనర్లకు సూచించారు.
ఇంటింటి చెత్త సేకరణలో స్వచ్ఛ ఆటోల పనితీరుపై పర్యవేక్షణ ఉండడం లేదని, రోజు దాదాపు వెయ్యి ఆటోల వరకు అటెండెన్స్ ఉండడం లేదని, ఈ విషయంలో జోనల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. జోనల్ కార్యాలయాల సేవలు పకడ్బందీగా జరపాలని పేర్కొంటూనే, నగరం నడిబొడ్డున ఉన్న ఓ జోనల్ కమిషనర్‌కు కమిషనర్ రొనాల్డ్ రాస్ తనదైన శైలిలో చురకలు అట్టించినట్లు తెలుస్తోంది. అవినీతి, అక్రమాలపై సీరియస్ యాక్షన్ ఉంటుందని, జాగ్రత్తగా విధుల్లో అంకితభావంతో పనిచేయాలని కమిషనర్ మందలించినట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

