Drinking Water | కేసీఆర్ ఫ్రీగా ఇస్తే.. కాంగ్రెస్ పాలనలో తాగునీటికి బిల్లులు
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార్జీలు మాత్రం చెల్లించాల్సి వస్తున్నది. ఇదేం అన్యాయమని అడిగితే సమస్యను పరిష్కరించే నాథుడు లేడు. దీంతో బడంగ్‌పేట మున్సిపాలిటీలోని గాంధీనగర్ వాసులు సోమవారం ఏకంగా మున్సిపల్ కార్యాలయం ముందే ఆందోళన చేశారు. ఇంజనీరింగ్ విభాగం డీఈని ఘెరావ్ చేశారు.
- బడంగ్‌పేట గాంధీనగర్ పేదలకు తాగునీటికి వేల రూపాయల్లో బిల్లులు
- గృహజ్యోతికి అర్హులైనా.. తప్పని కరెంటు చార్జీలు
- బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కాలనీ వాసుల ఆందోళన
Drinking Water | బడంగ్‌పేట, జనవరి 27 : రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార్జీలు మాత్రం చెల్లించాల్సి వస్తున్నది. ఇదేం అన్యాయమని అడిగితే సమస్యను పరిష్కరించే నాథుడు లేడు. దీంతో బడంగ్‌పేట మున్సిపాలిటీలోని గాంధీనగర్ వాసులు సోమవారం ఏకంగా మున్సిపల్ కార్యాలయం ముందే ఆందోళన చేశారు. ఇంజనీరింగ్ విభాగం డీఈని ఘెరావ్ చేశారు.
ఇన్నాళ్లూ ఉచితంగా ఇచ్చి..
బడంగ్‌పేట మున్సిపాలిటీలోని గాంధీనగర్‌లో 1400 పై చిలుకు కుటుంబాలు ఉన్నాయి. వీరందరూ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేవలం 20 ఇండ్లకు మాత్రమే జీరో బిల్లులు ఇస్తున్నారు. మిగతావారికి మాత్రం వందల రూపాయల్లో బిల్లులు పంపుతున్నారు. కాలనీ వాసులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ సమస్య అలాగే ఉండిపోయింది. కాలనీ ఏర్పడిన నాటి నుంచి.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తాగునీళ్లను ఉచితంగానే సరఫరా చేశారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో మాత్రం పాత బకాయిలన్నీ కలిపి ఇవ్వాలంటూ ఒక్కో ఇంటికి వేల రూపాయల్లో బిల్లులు పంపారని కాలనీ వాసులు మండిపడుతున్నారు.
గాంధీనగర్‌లో 50 గజాలు, 30 గజాల ఇండ్లు ఉన్న వారికి 15వేలు,20 వేలు కట్టాలని నోటీసులు పంపిస్తే ఎలా కట్టగలమని వాపోయారు. అంతేకాకుండా తమ కాలనీకి మంజూరైన రోడ్డును ఉన్నట్టుండి రద్దు చేశారని అందుకు కారణమేమిటో చెప్పాలని పట్టుబట్టారు. మంచినీటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని బడంగ్‌పేట కమిషనర్ కూడా ఇటీవల హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిల్లులు మాఫీ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో పేదల కాలనీలలో ఉచిత విద్యుత్ ఇస్తామని హమీ ఇచ్చారని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వందలో పది మందికి జీరో బిల్లు ఇచ్చి అందరికి అయిపోయిన్నట్లు చెప్పడం పై కాలనీ వాసులు మండి పడుతున్నారు.
30 వేల నీటి బిల్లు వచ్చింది: నర్సమ్మ గాంధీ నగర్
గాంధీనగర్‌లో మేం ఉంటున్న 2 గదులకు 30వేల బిల్లొచ్చింది. ఎట్ల గట్టాలె. పేదోళ్లం సారూ. బిల్లులు మాఫీ చేస్తమంటిరి. ఇప్పటివరకు చేయలేదు. నెలనెలా మాకైతే బిల్లులు పంపిస్తున్నరు. నీైళ్లెతే సరిగ్గ వస్తలేవు కానీ బిల్లులు మాత్రం ఇచ్చిపోతున్నరు.
ముసలోళ్లం ఎట్ల గడ్తం: లక్ష్మీ నర్సమ్మ
ఎలక్షన్లప్పుడు .. నీళ్లు ఫ్రీగ ఇస్తమన్నరు. కరెంటు ఫ్రీ అన్నరు. ఎలక్షన్లు అయిపోయినాంక మా బాధను ఎవ్వరు పట్టించుకుంటలేరు. మేం ముసలోళ్లం. బిల్లులు కట్టనీకె వేల రూపాయలు ఏనుంచి పట్కరావాలె.
న్యాయం చేయండి: సత్యనారాయణ
గతంలో..ఈ సమస్యలను మేయర్‌కు, కమిషనర్‌కు చెప్పినం. వాళ్లు మా బిల్లులను మాఫీ చేయిస్తమన్నరు. ఇప్పుడేమో ఎవ్వరూ పట్టించుకుంటలేరు. మా కాలనీలో నూటికి పదిశాతం కూడా జీరో బిల్లులు వస్తలేవు.
పై అధికారులకు విన్నవిస్తా: డిఈ జ్యోతి
గాంధీనగర్ తాగునీటి సమస్యను, బిల్లుల వ్యవహారాన్ని జలమండలికి నివేదిస్తాను. ఈ సమస్యను పరిష్కరించాల్సింది వారే. ఇక గృహజ్యోతి-జీరో బిల్లుల వ్యవహారం కూడా నా పరిధిలో లేదు. గాంధీనగర్ వాసులు నా చాంబర్ ముందే ధర్నా చేశారు. విషయాల్నింటినీ కమిషనర్‌కు వివరిస్తాను. కాలనీల్లో ఉన్న రోడ్లను పరిశీలిస్తాను.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

